ప్రస్తుతం పవన్‌కళ్యాణ్ - త్రివిక్రమ్‌ల కాంబినేషన్‌లో పవన్ 25వ ప్రతిష్టాత్మక చిత్రంగా రూపొందుతున్న 'పీఎస్‌పీకే 25' చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఇక వీరి కాంబినేషన్‌లో 'జల్సా, అత్తారింటికి దారేది' తర్వాత వస్తున్న హ్యాట్రిక్ చిత్రం కావడం, బహుశా ఎన్నికలకు ముందు పవన్ నటించే చివరి చిత్రం ఇదే అవుతుందనే వార్తలతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇలాంటి చిత్రం ద్వారా తమిళ సంగీత సంచలనం అనిరుధ్ మ్యూజిక్ డైరెక్టర్‌గా తెలుగుకు పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే.
దీని గురించి అనిరుధ్ మాట్లాడుతూ, మొదటి చిత్రమే పవన్‌కళ్యాణ్, త్రివిక్రమ్‌ల వంటి దిగ్గజాలతో చేయడం ఎంతో ఆనందంగా ఉంది. షూటింగ్ ప్రారంభమైన తర్వాత పవన్‌గారి వద్దకు వెళ్తే 'తెలుగు చిత్ర పరిశ్రమకు స్వాగతం' అని ఆహ్వానించారు. పవన్ బిగ్‌స్టార్ అని అందరికీ తెలుసు. పవన్ మాస్ హీరో కనుక ఆయన చిత్రాలపై భారీ అంచనాలుంటాయి. మ్యూజిక్ లవర్స్, పవన్ ఫ్యాన్స్‌ని నా సంగీతం మెప్పిస్తుందని భావిస్తున్నానని చెప్పాడు. ఇక తాను తన తర్వాతి తెలుగు చిత్రం కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోనే, ఎన్టీఆర్ హీరోగా నటించే చిత్రానికి పనిచేస్తున్నానని క్లారిటీ ఇచ్చాడు.
ఇక పవన్ అంటే తన మేనరిజమ్స్‌తో అందరికీ ఆకట్టుకుంటాడు కాబట్టి ఆయనకు ఏ తరహా ట్యూన్ ఇచ్చినా ఓకే. ఇక అనిరుధ్‌కి మెలోడీలు బాగా ఇస్తాడనే పేరుంది. ఇక మాస్‌బీట్ సాంగ్స్‌ని కూడా తనదైన మెలోడీతోనే ఇస్తాడు. కానీ ప్రస్తుతం ఎన్టీఆర్ క్లాస్ చిత్రాలలో కూడా నటిస్తున్నా.. ఆయన పాటలు మాత్రం సినిమా కథతో సంబంధం లేకుండా ఊరమాస్ సాంగ్స్‌ని, స్టెప్స్‌ని, బ్యాండ్ సౌండ్ తరహా పాటలను కోరుకుంటారు. మరి అనిరుధ్ ఎన్టీఆర్ అభిమానులని ఎలా ఆకట్టుకుంటాడో వేచిచూడాల్సివుంది...!