Advertisement
Google Ads BL

ఫ్యామిలీ మొత్తం ఉప్మా.. సారీ ఒకే ఫోజులో..!


టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కి ఎంత క్రేజ్ ఉందో అందరికి తెలిసిందే. 'బ్రహ్మోత్సవం' అతి పెద్ద డిజాస్టర్ గా నిలిచినా 'స్పైడర్' పై ఆ సినిమా ఛాయలు పడలేదంటేనే, మహేష్ బాబు స్టామినా ఏంటో అర్ధమవుతోంది. అసలు మహేష్ బాబు ఎటువంటి వివాదాల జోలికి వెళ్ళడు. సినిమాలు చేస్తున్నానా.. ప్రేక్షకులకు నచ్చుతాయా లేదా అనేది మాత్రమే ఆలోచిస్తాడు. అలాగే సినిమా విజయాలకు పొంగిపోడు..... అపజయాలకు కుంగిపోడు. మహేష్ ఎంత డిస్టర్బ్ లో ఉన్నా కూడా తన ఫ్యామిలీతో కలిసి కాసేపు గడిపితే చాలు చాలా కూల్ అవుతాడంటుంది అయన భార్య నమ్రత.

Advertisement
CJ Advs

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో సినిమాలపైనే కాకుండా ఫ్యామిలీ కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే హీరో ఎవరైనా వున్నారు అంటే అది మహేషే.  తన భార్య నమ్రత, పిల్లలు గౌతమ్, సితారాలతో మాత్రం టైమ్ దొరికితే చాలు..మహేష్ బాబు ఎంతో ఎంజాయ్ చేస్తాడనే విషయం చిన్న పిల్లలకు కూడా తెలుసు. ఇక మహేష్ ఫ్యామిలీతో గడిపే ప్రతి ఒక్క విషయాన్నీ  ఆయన భార్య నమ్రత  సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు అభిమానులకు చేరవేస్తూ వారి మధ్యన ఉన్న అనుబంధాన్ని తెలియజేస్తుంటుంది. అయితే ఇప్పుడు నమ్రత తాజాగా ఒక ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ ఫొటోలో ఒకే ఫోజులో మహేష్ బాబు, గౌతమ్ కృష్ణ, సితార, నమ్రతలు కనబడుతున్నారు.

మహేష్ తన ప్రతి సినిమా వేడుకలకి తన ఫ్యామిలీతో అటెండ్ అవడం చూస్తూనే ఉంటాం. ఇక ఆ వేడుకల్లో ఒక దానిలో మహేష్ చేతులు ముందుకు పెట్టుకుని సైడ్ లుక్ లో ఉన్న ఫోటోలాంటిదే గౌతమ్ చేతులు ముందుకు పెట్టుకున్న ఫోటో.. అలాగే సితార కూడా చేతులు ముందుకు పెట్టుకుని క్యూట్ లుక్స్ తో ఉన్న ఫొటోతో పాటు నమ్రత కూడా సేమ్ టు సేమ్ అలాంటి లుక్ తో..  ఒకేలా నిలబడిన ఆ నాలుగు ఫొటోస్ ని జత చేసి ఒకటే పిక్ గా సోషల్ మీడియాలో పోస్ట్  చేసింది. ఈ పిక్ సోషల్ మీడియాలో భలే ట్రెండింగ్ అవుతోంది. 

Mahesh Babu Family Members in Same Pose :

Mahesh Babu Family Pic Sensation in Social Media
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs