Advertisement
Google Ads BL

బెల్లంకొండ గురించి కొన్ని గంటల్లో తెలిసిపోతుంది!


బడా నిర్మాత బెల్లంకొండ సురేష్ తన కొడుకుని హీరోగా సినిమా పరిశ్రమలో నిలబెట్టడానికి చాలా కష్టాలే పడుతున్నాడు. 'అల్లుడు శీను' సినిమాతో హీరోగా... ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన బెల్లంకొండ శ్రీనివాస్ రీసెంట్ గా బోయపాటి దర్శకత్వంలో వచ్చిన 'జయ జానకి నాయక' తో మంచి కమర్షియల్ గా ఒక మాదిరి హిట్ ని సాధించాడు. 'అల్లుడు శీను, స్పీడున్నోడు' సినిమాలు యావరేజ్ టాక్ సొంతం చేసుకున్నా కూడా 'జయ జానకి నాయక' మాత్రం ఒక మాదిరి హిట్ ని సొంతం చేసుకుంది. అయితే ఆ సినిమా హిట్ తో ఇప్పుడు తన నెక్స్ట్ సినిమా పై ఎక్కువ ఫోకస్ పెట్టాడు బెల్లంకొండ శ్రీనివాస్. 

Advertisement
CJ Advs

బెల్లంకొండ శ్రీనివాస్ తన తదుపరి చిత్రాన్ని శ్రీవాస్ దర్శకత్వం లో ఒక రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశ లో ఉంది. అభిషేక్ పిక్చర్స్ పై తెరకెక్కుతున్న ఈ సినిమా  ఫస్ట్ లుక్ ని ఇంకా టైటిల్ ని కలిపి  దీపావళి కానుకగా రిలీజ్ చేస్తున్నారు. అయితే ఈ దీపావళి కానుకగా రివీల్ చేసే టైటిల్ అప్పుడే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. బెల్లంకొండ శ్రీనివాస్ - శ్రీవాస్ కలయికలో వస్తున్న ఆ సినిమా టైటిల్ 'సాక్ష్యం' అంటూ చిత్ర బృందం ఫిక్స్ చేసినట్లుగా వార్తలొస్తున్నాయి. ఇక ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ సరసన 'డీజే' భామ పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా..... సీనియర్ హీరోయిన్ అయిన మీనా బెల్లంకొండ శ్రీనివాస్ కి అమ్మగా నటిస్తుందని టాక్ ఉంది.

ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ తోపాటు ఫిలింనగర్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్న 'సాక్ష్యం' టైటిల్ కూడా దీపావళికి విడుదల చెయ్యబోతున్నారు. మరి నిజంగానే బెల్లంకొండ 'సాక్ష్యం' టైటిల్ తో వస్తాడా లేదా మారేదన్నా టైటిల్ ని ఫిక్స్ చేసుకుని వస్తాడా అనేది మరి కొన్ని గంటల్లో తేలిపోతుంది.  

Bellamkonda Srinivas Next Gets A New Title!:

currently he is working on an action filled revenge drama script written and directed by Sriwass.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs