తమిళంలో కె.బాలచందర్ ద్వారా పరిచయమైన హీరోలు, హీరోయిన్లు బాగా రాణిస్తారనే నమ్మకం అందరిలో ఉంది. అలా బాలచందర్ ద్వారా హీరోయిన్‌గా పరిచయమైనా కూడా సీనియర్ నటి సుధ హీరోయిన్‌గా సక్సెస్‌కాలేదు. దాంతో ఆయన నువ్వు హీరోయిన్‌గా సూట్‌కావు. ఏమైనా సపోర్టింగ్ రోల్స్ చేయమని సలహా ఇచ్చాడు. ఇక తెలుగులో ఆమె చిరంజీవి నటించిన 'గ్యాంగ్‌లీడర్' ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుని 'ఆమె' వంటి చిత్రంలో తన నటనా సత్తాను చాటింది. తర్వాత అమ్మ, వదిన, అక్క వంటి సపోర్టింగ్‌రోల్స్‌లో తెలుగులో మంచిగుర్తింపు తెచ్చుకుంది.
ఇక హీరోల విషయంలో ఆమె బాగా ఇష్టపడేది ఒకటి ఉదయ్‌కిరణ్ అయితే రెండో వ్యక్తి నాగార్జున. కాగా 'ప్రెసిడెంట్‌గారి పెళ్లాం' చిత్రం షూటింగ్‌లో జరిగిన సంఘటనను ఆమె తాజాగా గుర్తు చేసుకుంది. ఆ చిత్రం సమయంలో రెండు రోజుల నుంచి కడుపునొప్పిగా ఉన్నా మామూలు కడుపునొప్పే అని నిర్లక్ష్యం చేశాను. కానీ మూడోరోజు షూటింగ్ స్పాట్‌కి వెళ్లి అక్కడ కుప్పకూలిపోయాను. అది అపెండిసైటిస్ అని తెలిసింది. ఈ 24గంటల కడుపునొప్పితో నేను నిజంగానే చనిపోయేదానిని.
కానీ ఆ రోజు షూటింగ్ స్పాట్‌లో నాగార్జునగారు ఉన్నారు. ఆయన వెంటనే నన్ను అపోలో హాస్పిటల్‌లో చేర్చి ఆపరేషన్ చేయించారు. నేను ఈ రోజు బతికున్నానంటే అది నాగార్జున గారి పుణ్యమే. ఇక ఉదయ్‌కిరణ్ నన్ను అమ్మా..అమ్మా అంటూ ఎంతో అభిమానంతో కొడుకులా ఉండేవాడు. మొదటి పెళ్లి ఆగిపోవడం, తల్లి మరణం, తర్వాత ఇతర అనేక పరిస్థితుల వల్ల అతను ఒంటరిగా ఫీలై ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పటికీ నా కూతురు ఉదయ్ అన్నని మన వద్దనే ఉంచుకుంటే బతికి ఉండేవాడమ్మా అంటూ ఉంటుంది. నిజమే.. వాడిని నేను దత్తత తీసుకుని ఉంటే బాగుండేది... అంటూ కన్నీళ్లు పెట్టుకుంది.