Advertisement
Google Ads BL

రేణుదేశాయ్‌ ఆవేదనలో కూడా అర్ధం వుంది!


రేణుదేశాయ్‌ తన భర్త పవన్‌కళ్యాణ్‌ నుంచి విడిపోయిన తర్వాత ఆమె పూణెలో తన కొడుకు అకిరానందన్‌, కూతురు ఆద్యలతో ఒంటరిగా జీవిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఆమద్య ఆమెకు తీవ్రమైన ఆలోచనల వల్ల, డిప్రెషన్‌ వల్ల కాస్త గుండెకు సంబంధించిన అనారోగ్యం కూడా వచ్చింది. దాంతో తెల్లవారు జామున ఎవ్వరు తనకి తోడు లేకపోవడంతో ఆమె సోదరి వీరి వద్దకు వచ్చి ఆసమయంలో రేణుని హాస్పిటల్‌కి తీసుకెళ్లినట్లు ఓ ఇంటర్వ్యూలో రేణుదేశాయ్‌ చెప్పుకొచ్చింది. దాంతో నాకు, నా పిల్లలకు తోడు ఎవరైనా ఉంటే బాగుంటుంది కదా.. అనే ఆలోచనవచ్చి రెండో వివాహం ఆలోచన కూడా వచ్చిందని తెలిపింది. కానీ ఆమెను పవన్‌ అభిమానులు నానా విధాలుగా టార్గెట్‌చేశారు. 

Advertisement
CJ Advs

ఇక రేణుకి అనారోగ్యంగా ఉన్నప్పుడు ఆమె కూతురు ఆద్య స్కూల్‌ నుంచి వచ్చిందట. దానిని రేణు గమనించినప్పటికీ ఓపిక లేనందువల్ల తన కూతురిని పలకరించలేక అచేతనంగా ఉండిపోయిందట. చిన్నపిల్లలు మారాం చేస్తారే గానీ వారిలో ఎవ్వరికీ తెలియని ఎమోషన్స్‌ కూడా ఉంటాయి. దాంతో ఆద్య.. తన తల్లి కళ్లుమూసుకుని ఉండటాన్ని చూసి భయపడి 'అమ్మా చనిపోవద్దమ్మ.. మా కోసం బతుకమ్మా' అని పెద్దగా ఏడ్చేసిందట. దాంతో ఆద్య భయపడిన విషయం తెలుసుకుని రేణు కష్టం మీద ఏడవకమ్మా.. ఆ దేవుడిని ప్రార్ధించు అని తెలిపిందట. దాంతో తను కూడా ఏడిస్తే ఆ పసిపాప మరింతగా భయపడుతుందని భావించి తానే ఓపిక తెచ్చుకుని 'నీకు పెళ్లి చేయకుండా.......నీ బాగోగులు చూడకుండా నేను ఎక్కడికి పోను' అని చెప్పిఓదార్చిందట.

కానీ ఆమె కొడుకు అకిరానందన్‌ మాత్రం రేణుకి బాగాలేనప్పుడు ఎంతో గుండెనిబ్బరం చూపాడట. ఉదయాన్నే స్కూల్‌కి వెళ్లే ముందు తల్లి మంచం దగ్గరకు వచ్చి ధైర్యం చెప్పేవాడట. సాయంత్రం స్కూల్‌ నుంచి ఇంటికి రాగానే తల్లి మంచం వద్దకు వచ్చి ఏమైనా కావాలి? మందులు వేసుకున్నావా? అని అడిగేవాడట. మరిసింగిల్‌ పేరెంట్‌ ఉంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉంటుందో అనుభవిస్తేగానీ తెలియదు. ఇక పవన్‌ని వెనకేసు కొచ్చి రేణుదేశాయ్‌ని విమర్శిస్తున్నవారి అభిమానులు.. తమ అభిమాన హీరో భార్య, పిల్లలు కూడా ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌, బన్నీ వంటి వారి భార్యలలాగే లగ్జరీగా గడపకుండా ఇప్పటికీ పిల్లలను ఒంటిరిగా ఉంచి ఓ రియాల్టీషోకి జడ్జిగా చేయాల్సిన ఖర్మ ఏమొచ్చింది? అని ఆలోచించేవారు ఎవరైనా ఉన్నారా? 

Renu Desai Talks about Her Children:

Single Parent Situation So Difficult, Renu Desai Is Tha Example
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs