Advertisement
Google Ads BL

నాగార్జునపై కమెడియన్ కి ఎందుకంత కోపం?


రాజుగారి గదిలో కామెడీ పుష్కలంగా వుంది చిన్న స్టార్స్ తోనూ సినిమా భారీ విజయం సాధించింది. అందులో ధనరాజ్, షకలక శంకర్ వంటి వారు కామెడీని పుష్కలంగా పండించారు. హర్రర్ కామెడీగా తెరకెక్కిన ఈ సినిమా చిన్న సినిమా గా విడుదలై భారీ విజయం సాధించింది. అయితే ఇప్పుడు తాజాగా రాజుగారి గదికి సీక్వెల్ గా రాజుగారి గది 2  సినిమా వచ్చింది. అందులో ప్రవీణ్, వెన్నెల కిషోర్, షకలక కామెడీ పెద్దగా పండించలేదు. కేవలం సినిమా మొత్తం నాగార్జున, సమంతల మీదే నడిచిందని క్రిటిక్స్ తో పాటు ప్రేక్షకులు అన్నారు. అంటే మొదటి గదిలో కామెడీ పండగా.. రెండో గదిలో కామెడీ వర్కౌట్ అవ్వలేదనంటున్నారు.

Advertisement
CJ Advs

అయితే గది 2  లో షకలక శంకర్ ఏసు పాత్రలో కొద్దిగా కామెడీ పండించాడు. అయితే షకలక శంకర్ కామెడీ ఈ సినిమాలో  చాలానే ఉందట. కానీ సినిమా ఎడిటింగ్ లో షకలక కామెడీని నాగార్జున కావాలనే కత్తిరించాడట. షకలక శంకర్ నటించిన అయిదు నిమషాల సీన్లను ఎడిటింగ్ లో ఎత్తిపారేశారట. అది కూడా నాగార్జున వలెనే అంటున్నారు. ఆ ఐదు నిమిషాల కామెడీ సీన్స్ లో షకలక శంకర్ కామెడీ ఇరగదీసే లెవల్లో ఉందట. ఆ ఐదు నిమిషాల్లోనే షకలక కేఎ పాల్.... ఇంకా మరి కొంత మంది సెలబ్రిటీస్ ని బాగా ఇమిటేట్ చేసాడని తెలుస్తోంది. 

అయితే నాగార్జున కూడా శంకర్ మీద కోపంతో ఆ సీన్స్ లేపెయ్యలేదట. ఇదే విషయమై నాగ్ ను ప్రశ్నిస్తే..... మాంచి ఫీల్ గుడ్ సీన్ల తరువాత ఇలాంటి కామెడీ సీన్లు రావడం కరెక్ట్ కాదని..... యూనిట్ అంతా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంతోనే లేపేసామని అన్నాడట. కానీ ఇది నాగ్ ఒక్కడి నిర్ణయమే అని ఇన్సైడ్ టాక్. ఇక నాగ్ ఈ సినిమాకి వెన్నుముక కాబట్టి ఆ కామెడీ సీన్స్ లేపేసే విషయంలో కొందరికి నచ్చకపోయినా ఏమనలేక సైలెంట్ అయ్యారట. ఇక ఈ విషయమంతా చూసిన షకలక శంకర్ కొద్దిగా అప్ సెట్ అవడం కారణంగానే రాజుగారి గది ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గాని, ప్రెస్ మీట్ కి గాని... రాజుగారి గది 2  సక్సెస్ మీట్ కి గాని హాజరవలేదని తెలుస్తుంది. మరి ఇలా రాజుగారి గది విజయంలో పాలుపంచుకోలేదంటే షకలక నాగ్ మీద అలిగాడనేగా దానర్ధం.

Shakalaka Shankar Fires on Nagarjuna:

Comedian Shakalaka Shankar Feels on his RGG2 Scenes Delete
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs