Advertisement
Google Ads BL

హన్సిక... అనుష్కకి కూడా ఉపాయం చెప్పమ్మా!


ఒక ఏడాది ముందు హన్సిక కూడా ఎంతో బొద్దుగా ఉండేది. సాధారణంగా తమిళులకి హీరోయిన్స్‌ సైజ్‌జీరోలో ఉంటే నచ్చరు. కనీసం సైజ్‌ 100లో ఉండాల్సిందే. నాటి ఖుష్బూ నుంచి నమిత, హన్సిక.. ఇలా చాలా మందినే చెప్పుకోవచ్చు. కానీ కేవలం తమిళ ప్రేక్షకుల కోసం బరువు పెంచుకుంటూ పోతే పక్క భాషల్లో అవకాశాలు రాక నమితలాగా అర్ధాంతరంగా కనుమరుగవుతారు. సో.. నయనతార రూట్‌ని హన్సిక ఫాలో అయి దాదాపు 20కేజీలు తగ్గింది. దాంతో అందరూ ఆశ్యర్యపోయారు. హన్సిక తగ్గిందయో అనుకున్నారు. 

Advertisement
CJ Advs

మరికొందరేమో ఈ నాజూకుతనం ఎంత కాలంలే.. మరలా ఆమె బరువు పెరిగి బొద్దుగా తయారవ్వడం ఖాయం. సినిమా వారి ప్రేమలు, పెళ్లిళ్ల లాగే వారి కొలతలు కూడా ఎప్పుడు ఒకేలా ఉండవు కదా...! అని సెటైర్లు వేసిన వారు కూడా ఉన్నారు. కానీ అందరి అంచనాలను తల్లకిందులు చేస్తూ ఏడాది దాటినా కూడా హన్సిక అదే నాజూకుతనాన్ని మెయిన్‌టెయిన్‌ చేస్తోంది. ఇదంతా డైటింగ్‌లు, జిమ్‌ వర్కౌట్స్‌ ద్వారా చేసింది కాదట. ఆమె యోగాలోని కొన్ని ఆసనాల వల్ల ఇలా నాజూకుగా తయారైంది. ఆమె తల్లకిందులుగా యోగా చేస్తున్న ఫొటోలు ఇప్పుడు సోషల్‌మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి.నిజానికి హన్సిక వంటి బిజీగా దేశవిదేశాలు, పలు ప్రాంతాలలో బిజీగా గడిపేవారికి యోగానే బెస్ట్‌ అంటున్నారు. 

కొన్నిసార్లు వర్షాల రోజుల్లో, ఇతర ప్రదేశాలలో జాగింగ్‌లు, జిమ్‌ వర్కౌట్స్‌ వీలుకాదు. అదే యోగాసనాలైతే ఎంచక్కా హోటల్‌ రూమ్‌లోనే చేసుకోవచ్చు. ఇక మన స్వీటీ అనుష్క విషయానికి వస్తే ఆమె స్వతహాగా యోగాటీచర్‌. తాను బరువు పెరిగినా మరలా యోగా ద్వారా బరువు తగ్గగలననే నమ్మకంతో ఆమె 'సైజ్‌జీరో' చిత్రం కోసం బాగా బరువు పెరిగింది. కానీ ఆ తర్వాత తనకొచ్చిన యోగాతో తగ్గలేదు. దాంతో ప్రస్తుతం ఆమె కేరళలో వెయిట్‌ లాస్‌ ట్రీట్‌మెంట్‌ తీసుకుంటోందిట. మరి ఆ సీక్రెట్‌ ఏమిటో హన్సిక అనుష్కకి కూడా చెబితే, ఎలాగూ యోగా టీచర్‌ కాబట్టి బరువు తగ్గేలా చూసుకుంటుంది. మరి హన్సిక చెబుతుందా? లేక తనకే పోటీ వస్తుందని ఆ సీక్రెట్స్‌ని దాస్తుందా? చూడాలి...! 

Hansika Weight Loss Secret :

Heroine Hansika about Weight Loss with Yoga
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs