Advertisement
Google Ads BL

రెండు బీర్లు.. ఒక బిర్యానీతో సెలెబ్రేషన్స్!!


అక్కినేని ఇంటికోడలిగా అడుగు పెట్టింది సమంత.. పెళ్లి తర్వాత అలా అక్కినేని ఇంట్లో అడుగుపెట్టిందో లేదో... అలా మామగారితో కలిసి 'రాజుగారి గది 2'  తో  విజయాన్ని తీసుకొచ్చింది. ముఖ్యంగా నాగార్జున కూడా కోడలిగా సమంత తమ ఇంట్లో అడుగుపెట్టిన క్షణాన్ని ఆస్వాదించడమే కాదు 'రాజుగారి గది 2'  సినిమా విజయాన్ని కూడా ఆస్వాదిస్తూ ఆనందంలో తేలిపోతున్నాడు. ఆ విషయం నాగార్జున 'రాజుగారి గది 2' సక్సెస్ మీట్ లో ఓపెన్ గానే చెప్పాడు. మొదటగా చైతు - సామ్ ల పెళ్లిని గోవాలో రెండు రోజుల పాటు సెలెబ్రేట్ చేసుకున్నానని... అలాగే ఇప్పుడు 'రాజుగారి గది 2' విజయాన్ని సెలెబ్రేట్ చేసుకుంటున్నానని చెబుతున్నాడు.

Advertisement
CJ Advs

మరి రుద్రగా నాగార్జున నటన 'రాజుగారి గది 2' సినిమాని ఒక లెవెల్ కి తీసుకెళ్లింది. నాగార్జున నటనకు అందరూ బ్రహ్మరధం పడుతున్నారు. ఇక ఆత్మగా... అమృతగా సమంత కూడా అదరగొట్టే పెరఫార్మెన్సు తో చంపేసింది. 'రాజుగారి గది 2' పాజిటివ్ టాక్ తోనే థియేటర్స్ లో రన్ అవుతుంది. అలాగే నాగార్జున కూడా రాజుగారి గది టాక్ అన్నివైపులనుండి బాగుందని.. ఈ సినిమా విజయంతో అక్కినేని అభిమానులు ఫుల్ హ్యాపీగా వున్నారని..... అభిమానుల సంతోషాన్ని నేను కూడా రెండు బీర్లు తాగి బిర్యానీ తిని సెలెబ్రేట్ చేసుకుంటున్నా అంటూ సరదాగా అనేశాడు.

Nag Celebrates Raju Gari Gadhi 2 Success with Beers:

Nag Success Celebration with Beer and Biryani
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs