సోషల్ మీడియా అంటేనే నేడు వివిధ పార్టీల సానుభూతి పరులు, నాయకులు, సినీ హీరోల అభిమానులు ఒకరినొకరు తిట్టుకోవడం,ఒకరి మీద ఒకరు బూతు జోకులు వేసుకోవడం, ఇంకా వారి ఫొటోలను మార్ఫింగ్ చేసి నానా విధాలుగా పెడుతుండటం విశృంఖలంగా మారుతోంది. తాజాగా ఎవరో టిడిపి అభిమాని రోజాకి గుండు కొట్టి పెట్టిన ఫొటోపై రోజా తీవ్రంగా మండిపడ్డారు. వాడెవడో కనిపిస్తే చెప్పుతో కొడతాను. ఓ అబ్బా అమ్మకి పుట్టి ఉంటే ఇలాంటి పని చేస్తాడా? వాడిని చెప్పుతో కొడతాను. వాడిని ఏం చేయాలి? అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది నాకే కాదు.. ఎందరో వైసీపీ నేతలను ఇలాగే అసహ్యకరంగా మార్ఫింగ్ చేస్తున్నారు. ఏం మేము టిడిపికి చెందిన వారి భార్యల ఫొటోలకు గుండు కొట్టి పెట్టలేమా? వాడెవడో తెలిస్తే వదిలిపెట్టను.. అని చెబుతూనే టిడిపిని అభిమానించడం తప్పు కాదు... ఇలాంటి కుసంస్కారులు ఆ పార్టీలో ఎందరో ఉన్నారు... అని మండిపడింది.
ఓ గౌరవనీయమైన స్థానంలో ప్రజా ప్రతినిధిగా ఎమ్మెల్యేగా ఉన్న ఆమె మరీ ఇంతగా రెచ్చిపోయి అమ్మనాన్నలను బూతులు తిట్టడం సమంజసమేనా? ఆమె ఎన్నిసార్లు చంద్రబాబు, లోకేష్, ఇతర మంత్రులు, పవన్ కళ్యాణ్, చిరంజీవి వంటి వారిని బూతులు తిట్టలేదు? పవన్ భార్య రేణుదేశాయ్ సినీ నటే కదా? ఆమె ఎందరి పడకల్లో పడుకుందో ఎవరికి తెలుసు? అని దురుసుగా మాట్లాడలేదా? పంజాబీ డ్రెస్ వేసుకుందని భూమా అఖిలప్రియని అనరాని మాటలు అనలేదా? అసెంబ్లీ సాక్షిగా బూతులు, బూతు సంజ్ఞలు చేయలేదా? చంద్రబాబును బొల్లిబాబు అని, లోకేష్‌ని పప్పు అని వ్యక్తిగత విమర్శలను దిగజార్చి మాట్లాడలేదా? కేవలం టిడిపి అభిమానులు మాత్రమే ఇలాంటి మార్ఫింగ్ ఫొటోలు పెడుతున్నారా? సోషల్‌మీడియాను బాగా ఫాలో అయితే ఫేస్‌బుక్‌ల్లో ఇలాంటి పరమ అసహ్యకరమైన ఫోటో మార్ఫింగ్‌లు చంద్రబాబు, బాలకృష్ణ,నారా లోకేష్, పవన్‌లపై పెడుతున్న విషయాన్ని విస్మరించావా రోజా? వారు కూడా మనుషులే.. కాబట్టి అందరూ దొంగలే అన్నట్లు పరిస్థితి తయారైంది. ఈ పోకడ ఒక్క టిడిపి వారిలోనే కాదు.. వైసీపీ వారిలో కూడా ఉన్న విషయాన్ని గుర్తు చేసుకో...!