Advertisement
Google Ads BL

అమీర్‌‌ఖాన్‌కి ఏటుచూసినా ప్రశంసలే!


ప్రస్తుతం దేశంలోని మిస్టర్‌ పర్‌ఫెక్షనిస్ట్‌లలో అమీర్‌ఖాన్‌ అగ్రగణ్యుడు. కాగా ప్రస్తుతం ఆయన 'సీక్రెట్‌ సూపర్‌స్టార్‌' అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈచిత్రాన్ని ఆయన నిర్మించడమే కాదు...ఇందులో ఓ కీలకపాత్రను కూడా పోషిస్తున్నాడు. అది ఓ సంగీత దర్శకుని పాత్ర. ఇక ఈ చిత్రం ప్రమోషన్లలో భాగంగా దేశవ్యాప్తంగా తిరుగుతున్న అమీర్‌ పలు ముఖ్యనగరాలలో ప్రముఖుల కోసం స్పెషల్‌ షోలు వేస్తున్నాడు. ఈ నేపధ్యంలో ఢిల్లీలో వేసిన స్పెషల్‌ షోకి బిజెపి రాజకీయ దిగ్గజం, కురు వృద్ద నాయకుడు అద్వానీ, ఆయన కూతురు, పలువురు రాజకీయప్రముఖులు హాజరయ్యారు. 

Advertisement
CJ Advs

చిత్రం పూర్తయిన తర్వాత థియేటర్‌ చప్పట్లతో మారుమోగిపోయింది. ఇక ఆ తర్వాత చాలాసేపు అద్వానీ అమీర్‌ఖాన్‌తో ప్రత్యేకంగా చర్చించడం జరిగింది. దీనిపై అమీర్‌ స్పందిస్తూ.. సినిమాని అద్భుతంగా తీశారని అద్వానీ మెచ్చుకున్నట్లు చెప్పాడు. 'దంగల్‌' ఫేమ్‌ జైరా వసీమ్‌ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి అద్వైత్‌ చావ్లా దర్శకత్వం వహించాడు. ఇక ఈ చిత్రం విషయానికి వస్తే దీని ముందు 'దంగల్‌' చేసిన అమీర్‌ఖాన్‌ కొడుకుల కంటే కూతుర్లు దేనిలోనూ తీసిపోరని చూపించాడు. ఈ 'సీక్రెట్‌ సూపర్‌స్టార్‌'లో కూడా ఓ ముస్లిం యువతి తాను ముస్లింని అని తెలిస్తే తమ మత పెద్దల నుంచి వ్యతిరేకత వస్తుందని భావించి, తన ఉనికి బయటపడకుండా తనలోని టాలెంట్‌ని చూపించడమే ఈ చిత్ర కథాంశంగా తెలుస్తోంది. 

ఇలా స్త్రీలను చైతన్యం చేస్తూ ఉన్న చిత్రాలను తీయడం అమీర్‌ సామాజిక బాధ్యతకు నిదర్శనంగా చెప్పాలి. ఇక అమీర్‌ తన భార్య కిరణ్‌రావ్‌ కూడా మంచి నటి అని,ఆమె ఒప్పుకుంటే ఆమెతో ఓ రొమాంటిక్‌ చిత్రంలో నటించాలని ఉందని చెప్పడం విశేషం. మరోపక్క అమీర్‌ 'థగ్స్‌ ఆఫ్‌ హిందుస్థాన్‌' చిత్రం చేస్తున్నాడు. దీని కోసం ఆయన ముక్కుపుడక, చెవి రింగులతో ఈ 'సీక్రెట్‌ సూపర్‌స్టార్‌' ప్రమోషన్లలలో కనిపిస్తున్నాడు.

LK Advani Praises Aamir khan Secret Super Star:

LK Advani Watched Secret Super Star and Praises The movie Team
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs