Advertisement
Google Ads BL

రాజా సీక్రెట్స్ మొత్తం చెప్పేశాడు!


నిర్మాత దిల్‌రాజు చిత్రాలు హిట్టవుతాయి అనేచెప్పే కంటే విజయం సాధించే కథలనే ఆయన ఎంచుకుంటాడని చెప్పడం సమంజసం. 5శాతం విజయాలు కూడా ఉండని ఇండస్ట్రీలో దాదాపు 90శాతం సక్సెస్‌ రేషియోను మెయిన్‌టెయిన్‌ చేయడం సామాన్య విషయం కాదు. కాగా ఆయన రవితేజ హీరోగా, అందునా అంధునిగా నటిస్తున్న 'రాజా ది గ్రేట్‌' చిత్రం ఈనెల 18న దీపావళి కానుకగా విడుదల కానుంది. తెలుగువారికి దీపావళి సెంటిమెంట్‌ అచ్చిరాదని ఉన్న దురభిప్రాయాన్ని ఈ చిత్రంతో అధిగమిస్తానని దిల్‌రాజు బహిరంగంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. 

Advertisement
CJ Advs

ఇక 'మహానుభావుడు' హీరోయిన్‌ మెహ్రీన్‌ రవితేజకు జోడీగా నటిస్తున్న ఈ చిత్రం ప్రీరిలీజ్‌ వేడుకలో దిల్‌రాజు మాట్లాడుతూ, నాకు రవితేజతో 20ఏళ్ల అనుబంధం ఉంది. 'ఆర్య' కథను మొదట రవితేజకే చెప్పాం. కానీ ఆ పాత్ర తనకు సూట్‌ కాదని ఆయన చెప్పాడు. తర్వాత ఇదే కథను నితిన్‌, ప్రభాస్‌లకి చెప్పి చివరకి అల్లుఅర్జున్‌తో చేశాం. ఈ చిత్రం కథ బాగుందని, ఖచ్చితంగా విజయవంతం అవుతుందని రవితేజనే మొదట నాకు చెప్పాడు. ఇక రవితేజతో ప్రస్తుతం చేస్తోన్న 'రాజా ది గ్రేట్‌' విషయానికి వస్తే తెలుగులో హీరో గుడ్డివాడిగా నటిస్తే జనాలు చూస్తారా? అని పలువురు సందేహించారు. ఏమో.. క్లైమాక్స్‌లో ఆయనకు కళ్లు వస్తాయని, లేదా క్లైమాక్స్‌లో కళ్లు వస్తాయని భావించారు. 

కానీ ఈ చిత్రం ప్రారంభం నుంచి శుభంకార్డు వరకు రవితేజ అంధునిగానే కనిపిస్తాడని చెప్పాడు. ఈ ఏడాది తమకు 'శతమానం భవతి, నేను లోకల్‌, డిజె, ఫిదా' వంటి సూపర్‌హిట్స్‌ వస్తాయని 'రాజా ది గ్రేట్‌' తో మరో సూపర్‌హిట్‌ గ్యారంటీ అని తేల్చిచెప్పాడు. ఇక ఈ చిత్రంలో మెగా హీరో సాయి ధరమ్‌తేజ్‌ గెస్ట్‌ రోల్‌లో కనిపిస్తాడని వచ్చిన మాటలు నిజంకాదు. కేవలం ఈ చిత్రంలోని స్పెషల్‌ సాంగ్‌ షూటింగ్‌ సమయంలో సాయి దర్శకుడు అనిల్‌రావిపూడిని వ్యక్తిగతంగా కలవడానికి వచ్చాడు. ఆ సందర్భంగా రాశిఖన్నా, సాయిధరమ్‌తేజ్‌, అనిల్‌రావిపూడిలు కలసి సెల్ఫీ దిగారు. అంతేగానీ ఇందులో సాయి నటించడంలేదు. కానీ రాశిఖన్నా మాత్రం ఓ స్పెషల్‌ సాంగ్‌ని చేస్తోంది.

Dil Raju Praises Raviteja At Raja The Great Pre Release Event:

Dil Raju Speech Highlights at Raja The Great Pre Release Event
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs