పరభాష హీరోయిన్స్ అంతా తెలుగులో సినిమాలు చేసేటప్పుడు డైలాగ్స్ ని ఇంగ్లీష్ లో రాసుకుని తెలుగులో మాట్లాడుతూ ఉంటారు. ఇక ఆయాపాత్రలకు ఇక్కడ తెలుగు సింగర్స్ అయినా లేకుంటే డబ్బింగ్ ఆర్టిస్టులైనా హీరోయిన్స్ గొంతుకి డబ్బింగ్ చెప్పేస్తారు. ఇక టాప్ హీరోయిన్స్ గా ఉన్న ఇప్పుడున్న భామలంతా ఇలా అరువు గొంతులు మీద ఆధారపడి వాళ్లే. ఈ మధ్యనే రకుల్ ప్రీత్ సింగ్, రాశి ఖన్నా వంటి వాళ్ళు తెలుగు నేర్చుకుని తమ పాత్రలకు తామే డబ్బింగ్ చెప్పుకుంటున్నారు. అయితే ఇప్పుడు మలయాళ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ అయితే తెలుగులో చేసిన మూడు సినిమాలకే అనర్గళంగా తెలుగు మాట్లాడేస్తూ అందరి మతులు పోగొడుతుంది.
అస్సలు టాప్ హీరోయిన్స్ ఏదో కొద్దిగా తెలుగు నేర్చుకుని.. ఆడియో వేడుకల్లో, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో, సక్సెస్ మీట్స్ లో అభిమానులనుద్దేశించి.... అందరికి నమస్కారం, బాగున్నారా అనే పదాలు మాత్రమే మాట్లాడుతుంటారు. కానీ 'ప్రేమమ్, అఆ, శతమానంభవతి' సినిమాల్లో అదరగొట్టిన మలయాళీ ముద్దుగుమ్మ అనుపమ ఇప్పుడు తెలుగు భాష మీద మంచి పట్టు సాధించేసింది. తెలుగు సినిమాలు చేస్తూ తెలుగు నేర్చుకుని తెలుగు హీరోయిన్స్ మాదిరిగా తెలుగు మాట్లాడుతున్న ఈ భామ తాజాగా తాను నటించిన 'ఉన్నది ఒకటే జిందగీ' సినిమా ఆడియో వేడుకలో అనర్గళంగా తెలుగులో మాట్లాడి అదరగొట్టేసింది.
రామ్ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఉన్నది ఒకటే జిందగీ'లో అనుపమ పరమేశ్వరన్, లావణ్య త్రిపాఠిలు హీరోహీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ ఆడియో వేడుక తాజాగా హైదరాబాద్ లో జరిగింది. ఆ వేడుకలోనే అనుపమ ఉన్నది ఒకటే జిందగీ సినిమా తన జీవిత ప్రయాణంలో ఒక ప్రత్యేకమైన అనుభవమని.. ఇందులో తాను చేసిన మహా... పాత్ర తనను వ్యక్తిగతంగా కూడా ఎంతో మార్చిందని.. ఆ పాత్రను ఎప్పటికీ మరిచిపోలేనని మాట్లాడింది. అంతేకాక ఈ సినిమాలో రామ్ ఎనర్జీ చూసి ఆశ్చర్యపోయానని.. అలాంటి ఎనర్జీ ఎలా వస్తుందో తనకి అర్థం కాదని అంటుంది అనుపమ. మరి ఇలా మల్టీ టాలెంటెడ్ హీరోయిన్ గా అనుపమ తెలుగు హీరోయిన్స్ కి గట్టిపోటీ ఇచ్చేలాగే కనబడుతుంది.