Advertisement
Google Ads BL

గొప్పనటుడే కానీ గొప్ప వ్యక్తి మాత్రం కాదు!


నటునిగా లోకనాయకుడిని మెచ్చుకోని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు, దేశవ్యాప్తంగా ఆయన నటనకు నీరాజనాలు పలికి జేజేలు పలికే వారెందరో ఉన్నారు. ఆయన తన చిత్రాల ద్వారా నవ్వించాడు...ఏడిపించాడు. తన పాత్రల ద్వారా భయపెట్టాడు కూడా. కానీ గొప్పనటులందరూ గొప్ప వ్యక్తులు కాలేరు. మనకి తెలిసినంతలో సౌత్‌ ఇండస్ట్రీలో సహజీవనం మొదలుపెట్టింది ఆయనే. తన అన్న చారు హాసన్‌ని మోసం చేసి ఆయనపైనే నిందలు మోపాడు. సుహాసినిని చిన్నబుచ్చాడు. ఇక తన మొదటిభార్య వాణిగణపతికి విడాకులిచ్చి ఆమెను కట్టు బట్టలతో బయటకు పంపాడు. చివరకు ఆమె వల్ల తాను తన ఇంటిని కూడా అమ్మేసుకోవాల్సి వచ్చిందని ఏవేవో చెప్పుకొచ్చాడు. ఇక దీనికి ధీటైనజవాబు ఇవ్వడం కోసం వాణిగణపతి కూడా ఒక పనిచేసింది. కమల్‌కి ఓ కారు ఉండేది. అది అంటే ఆయనకు ఎంతో సెంటిమెంట్‌. దానిని వాణిగణపతి కమల్‌కి గిఫ్ట్‌ ఇచ్చింది. కానీ కారు పేరు మాత్రం వాణి మీదనే ఉంది. దాంతో తనను అవమానించిన కమల్‌కి టిట్‌ ఫర్‌ టాట్‌ అన్నట్లు ఆమె ఒకసారి సుహాసినితో కలిసి కమల్‌ ఇంటికి వెళ్లి ఆయన కారును తీసుకుని వెళ్లిపోయింది. కమల్‌ పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఆ కారు వాణి పేరు మీదనే ఉందని తెలిసి అవాక్కయ్యాడు. 

Advertisement
CJ Advs

ఇక బాలనటిగా చిన్ననాటి నుంచి కష్టపడుతూ, తన కుటుంబానికి తానే ఆధారమైన సారికాను శృతిహాసన్‌ పుట్టిన తర్వాతనే బలవంతం మీద పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత అక్షరహాసన్‌కి వీరు జన్మనిచ్చారు. తర్వాత తనతో నటించిన తెలుగమ్మాయి గౌతమితో మోజుతో సారికాను నానా హింసలు పెట్టాడు. చివరకు ఆమె మణికట్టు నరాలు కోసుకుని ఆత్మహత్యా ప్రయత్నానికి ఒడిగట్టింది. ఇక పిల్లలైన శృతి, అక్షరలను మంచి చేసుకుని తన తల్లికి ఎదురుతిరిగేలా చేసి తనతోనే ఉంచుకుని ఎమోషనల్‌ బ్లాక్‌మెయిల్‌ చేసి సారికా ఆస్థిని కూడా తన వశం చేసుకున్నాడు. ఈ విషయాలు చూసిన ఆయన అన్నయ్య చారుహాసన్‌ కమల్‌ని తిట్టి మరలా ఆయనను తన ఇంటిలోకి రానివ్వలేదు. కానీ వాణిగణపతి, సారికలు ఎప్పుడు చెన్నై వచ్చినా తన ఇంట్లోనే వారికి చారుహాసన్‌ ఆతిధ్యం ఇచ్చి తన తమ్ముడి తరపున వారికి క్షమాపణలు చెప్పేవాడు. ఇక గౌతమి పరిస్థితి ఏంటో అందరికి తెలిసిందే.

ఆయనది విచ్చలవిడి జీవితం, స్త్రీలోలుడు, పిసినారి. ఇక ప్రపంచంలో తాను, తన కూతుర్లు ప్రతి జీవిని తిని ఉన్నామని, కుక్క, పాములను కూడా రుచిచూశామని గర్వంగా చెప్పేవాడు. గోమాంసం మీద ఆంక్షల్ని ఎదిరించి మెజార్టీ ప్రజల మనోభావాలను దెబ్బతీశాడు. ఇక తనలాగే తన కూతుర్లకి కూడా విచ్చలవిడితనం నేర్పాడు. వారు మద్యం, సిగరెట్లు, డ్రగ్స్‌, బోయ్‌ఫ్రెండ్స్‌, ఎఫైర్స్‌, ఇలా తమ కెరీర్‌ను కూడా పక్కనపెట్టేశారు. అక్షరకి సమాజంపై అవగాహన ఉంది. రాజకీయాలలోకాస్త నాలెడ్జ్‌ ఉంది. దాంతో కమల్‌ రాజకీయ పార్టీ పెడుతున్న నేపధ్యంలో ఆమె తన తండ్రి వెంటనే ఉండనుంది. 

తాజాగా శృతిహాసన్‌ కూడా తనతండ్రి రాజకీయ ఎంట్రీపై స్పందించింది. తన తండ్రి ధైర్యవంతుడు, నిజాయితీపరుడని, మొహమాటం లేకుండా మాట్లాడుతాడని, ఏది చేసినా సరైన ప్లానింగ్‌తో విశ్లేషించుకుని దిగుతాడని చెప్పింది. మరి ఆయన ధైర్యవంతుడైతే 'విశ్వరూపం' సమయంలో ఎందుకు జయను చూసి భయపడ్డాడు? హైదరాబాద్‌ వచ్చి కన్నీరు ఎందుకు పెట్టుకున్నాడు? తొందరపాటు వ్యక్తి కాదు.. ఎంతో ప్లానింగ్‌తో చేస్తాడనే విషయం నిజమైతే 'మరుదనాయగం నుంచి విశ్వరూపం2, శభాష్‌నాయుడు' వరకు ఎందుకు సరిగా ప్లాన్‌చేసుకోలేక దెబ్బతిన్నాడు? సో...శృతి తన తండ్రి విషయంలో చెప్పిన గొప్పలన్నీ తప్పే. ఇక కమల్‌ తన పుట్టినరోజు సందర్భంగా వచ్చే నెల 7వ తేదీన తన కొత్త పార్టీ పేరును, జెండాను, అజెండాను ప్రకటించనున్నాడు. 

Shruti Haasan Praises Her Father Kamal Haasan:

This is the Kamal Haasan Character 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs