Advertisement
Google Ads BL

పవన్ చేస్తున్నదే దిక్కులేదు, ఇంకొకటా?


పవన్ కళ్యాణ్.... త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమానే సరిగ్గా పూర్తి చేయలేకపోతున్నాడు. ఇప్పుడు ఆ చిత్రం తర్వాత మరో ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా వార్తలొకటి. పవన్ కళ్యాణ్ రాజకీయాలతో క్షణం తీరిక లేకుండా త్రివిక్రమ్ తో చేస్తున్న సినిమాని పట్టించుకోవడంలేదనే టాక్ ఉంది. త్రివిక్రమ్ - పవన్ కలయికలో PSPK 25  చిత్రం మొదలై చాలా నెలలు గడుస్తున్నాయి. ఇప్పటివరకు టైటిల్ గాని ఫస్ట్ లుక్ కి గానీ రాలేదు. అలాగే ఈసినిమా షూటింగ్ కూడా చివరి దశకు చేరుకుంది అంటున్నారు గాని క్లారిటీ లేదు. అయితే పవన్ చిత్రానికి అజ్ఞాతవాసి అనే టైటిల్ ఫైనల్ అయినట్లుగా... ఈ టైటిల్ తోపాటు ఫస్ట్ లుక్ ని కూడా వచ్చే దీపావళి అంటే వచ్చే గురువారమే విడుదల చేస్తారని ప్రచారం జరుగుతున్నప్పటికీ అధికారిక సమాచారం లేదు. 

Advertisement
CJ Advs

మరి ఆ సినిమా పరిస్థితే అలా ఉంటే ఇప్పుడు పవన్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ని సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో  చేస్తున్నాడు అనడం ఎంతవరకు కరెక్ట్. అలాగే పవన్ తో సినిమా చెయ్యడానికి రెడీ అయిన సంతోష్ శ్రీనివాస్ కూడా అప్పుడే పవన్ సినిమా స్క్రిప్ట్ ని రెడీ చేసినట్లుగా చెబుతున్నారు. అంతేకాకుండా సంతోష్ సినిమాలో పవన్ కళ్యాణ్ పోలీస్ పాత్రలో కనిపిస్తాడని... అది కూడా తమిళంలో విజయ్ నటించిన తేరి సినిమా తరహాలో ఉంటుందనే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే కేవలం పవన్ - సంతోష్ కలయికలో వస్తున్న సినిమా ఫస్ట్ హాఫ్ మత్రమే తేరి సినిమాలాగా ఉన్నప్పటికీ  సెకండ్ హాఫ్ మొత్తం పూర్తి డిఫ్రెంట్ గా ఉంటుందట. అంటే తేరి సినిమాకి రీమేక్ అయితే కాదు అంటున్నారు. చూద్దాం ఈసినిమా పట్టాలెక్కినప్పటిమాట కదా సినిమా స్టోరీ గురించి చర్చించేది అంటున్నారు కొందరు.

Pawan Kalyan Another Movie In Santhosh Srinivas Direction:

Pawan Kalyan Commits Another Film in Santhosh Srinivas Direction, Gossips or Real
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs