Advertisement
Google Ads BL

పవన్ ఫ్యాన్స్‌ని కూల్‌ చేయడానికేనా..?


ఇటీవలే అమీర్‌ఖాన్‌ తన రెండో భార్యతో తన మొదటి మాజీ భార్య బర్త్‌డే వేడుకలకి వెళ్లి సంబరాలు జరుపుకున్నాడు. మరి అంతలా కాకపోయినా పవన్‌, రేణుదేశాయ్‌లు విడిపోయినా వారి పిల్లలకు వారి మద్య మంచి సన్నిహిత సంబంధాలే ఉన్నాయి. పవన్‌ మూడో పెళ్లి చేసుకున్నా, ఆమెకి ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చినా కూడా రేణూదేశాయ్‌, తన పిల్లల విషయంలో కేర్‌ తీసుకుంటూనే ఉంటాడు. ఇక ఇటీవల బాబు పుట్టకముందు పవన్‌ విదేశాలకు వెళ్తూ తాజా భార్యకి తనకి పుట్టిన పాపతో పాటు రేణు పిల్లలను కూడా ట్రిప్‌కి తీసుకెళ్లాడు. 

Advertisement
CJ Advs

ఇక పవన్‌.. రేణుదేశాయ్‌కి విడాకులిచ్చిన తర్వాత ఆమె విషయంలో మౌనంగా ఉంటాడే గానీ ఎలాంటి కామెంట్స్‌ చేయడు. కానీ రేణుదేశాయ్‌ పవన్‌ పేరు ప్రస్తావన వచ్చినప్పుడల్లా పవన్‌ గురించి పాజిటివ్‌గానే మాట్లాడుతుంది. కానీ ఇటీవల రెండో పెళ్లి చేసుకోవాలనే ఆలోచన ఉన్నట్లు చెప్పడం, దానిపై పవన్‌ అభిమానులు ఆమెపై మండిపడిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఆమె బుల్లితెరపై 'నీతోనే' అనే డ్యాన్స్‌షోకి జడ్జిగా వ్యవహరిస్తోంది. దీంతో ఓ పార్టిసిపెంట్‌ ఆమెను ఇంప్రెస్‌ చేసి మంచి మార్కులు కొట్టేయాలని కాబోలు 'బద్రి' చిత్రంలోని పాటకు డ్యాన్స్‌ చేశాడు. ఆ డ్యాన్స్‌ని చూసిన రేణుదేశాయ్‌ ఆ పార్టిసిపెంట్‌ని ఉద్దేశించి 'పవన్‌ చేసినట్లు నీవు అసలు చేయలేకపోయావు. ఆయన చూపిన పర్‌ఫార్మెన్స్‌లో కనీసం 10శాతం పెర్ఫార్మ్‌ చేయాలేకపోయావని చెప్పి షాక్‌ ఇచ్చింది. 

ఇక పవన్‌ స్టైలే డిఫరెంట్‌ అని ఆకాశానికి ఎత్తేసింది. సాధారణంగా ఇలాంటి టాలెంట్‌షోలలో ఎలా చేసినా కూడా ఇంకా బాగా కష్టపడు అని కాస్త ప్రోత్సాహం కలిగించేలా మాట్లాడటం జడ్జిల వంతు. కానీ రేణుదేశాయ్‌ అయితే పార్టిసిపెంట్‌ని బాధపరిచేలా మాట్లాడి పవన్‌ని మెచ్చుకుని ఆయన అభిమానులను మరలా శాంతపరిచిందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఇక స్వతహాగా పవన్‌ తనకు తానే మంచి డ్యాన్సర్‌ని కానని ఒప్పుకుంటాడు. ఏదో స్టైల్‌, మేనరిజమ్స్‌చూపిస్తాడే గానీ గొప్పగా స్టెప్పులు వేయలేడు. మరి రేణు పనిగట్టుకుని ఎందుకు అలా అనిందో అన్న విషయం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. 

Renu Desai About Pawan Kalyan Dance!:

Pawan Kalyan Ex Wife Renu Desai hosted Neethone Dance Show. Renu Desai about Pawan Kalyan Dance Mannerism.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs