సినిమా ఇండస్ట్రీలో ఏ పాత్ర ద్వారా, లేదా ఏ రకమైన సినిమా ద్వారా, ఎలాంటి పాటల ద్వారా మొదట గుర్తింపు వస్తుందో అదే కోణంలోనే వారికి అవకాశాలు రావడం అన్నది మన ఇండస్ట్రీ వ్యక్తులు ప్రేక్షకులపై రుద్దుతున్న అభిప్రాయం. నాడు ఎల్‌ఆర్ ఈశ్వరి అంటే క్లబ్ అండ్ హస్కీ సాంగ్స్‌కి పరిమితం అన్నారు. మంచి సాహిత్య విలువలు, కిష్టమైన పాత్రలనే ఎక్కువగా బాలమురళీకృష్ణకి సైతం ఇచ్చేవారు. దాంతో ఆయన అసలు సినిమాలను పట్టించుకోలేదు. ఏసుదాస్‌వంటి గాయకుడిని వేదాంతం, విషాద గీతాలకు పరిమితం చేశారు. ఆత్రేయకు మనసు మీద రాసే పాటలను మాత్రమే ఇచ్చి మనసుకవి అని ముద్ర వేశారు. శ్రీశ్రీని కేవలం విప్లవాలకే పరిమితం చేశారు. ఇలా జరగడానికి అందరి తప్పు ఉంది. కొత్తదనాన్నిప్రోత్సహించకపోవడం వల్లే ఇలా ముద్రలు పడిపోతున్నాయి.
ఇక నేటి యంగ్ టాలెంటెడ్ సింగర్ గీతామాధురి అన్ని పాటలను బాగా పాడగలదు. కానీ ఆమెపై ఐటంసాంగ్స్ మాత్రమే బాగా పాడుతుందనే విమర్శలు బాగా వస్తున్నాయి. దీనిపై గీతామాదురి స్పందిస్తూ అలా అనేవారికి నేను పాడిన అన్ని పాటలు బాగా వినమని చెబుతాను. నేను ఎన్నో మంచి మెలోడీలు పాడాను. నా గొంతు మెలోడీలకు కూడా బాగా నప్పుతుందని తెలిసే సంగీత దర్శకులు నాకు అవకాశాలిస్తున్నారు. కేవలం ఐటం సాంగ్స్ ముద్ర వేసి, విమర్శలు చేస్తే నా అవకాశాలు తగ్గుతాయేగానీ నా ఆత్మసంతృప్తి, సంతోషం వంటివి అలానే ఉంటాయి. నాలోని టాలెంట్ గురించి విమర్శకుల కన్నా నాకే తెలుసు అని చెప్పుకొచ్చింది.