ఇప్పుడు సోషల్ మీడియాతో పాటు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలు కూడా బాగా విస్తరించాయి. ఒకప్పటిలా తమకు జరిగిన అన్యాయాలను, వేధింపులను చెప్పినా కూడా సదరు కారణ వ్యక్తులకు భయపడి మీడియా దానిని చెబుతుందా? లేదా? ఒత్తిళ్లకు తలొగ్గి బాధితురాలికి న్యాయం కోసం పోరాడుతుందా? లేదా? అనే కాలం ఇప్పుడు లేదు. సోషల్ మీడియాలో నిజమైన బాధితులు పేర్లతో సహా తమను వేధించి, లైంగిక వేధింపులకు గురిచేసిన వారి పేర్లు చెప్పినా కూడా వాటిని వేయడానికి, దానిపై చర్చ జరిపేందుకు మీడియాతో పాటు ప్రేక్షకులు, వీక్షకులు సిద్దంగా ఉన్నారు. తాజాగా హృతిక్, కంగనారౌనత్‌ల ఉదంతమే దీనికి ఉదాహరణ.
ఇక విషయానికి వస్తే తమిళంలో 'ధోని, తమిళ్ సెల్వన్, కబాలి' చిత్రాలలో నటించిన బాలీవుడ్ నటి రాధికాఆప్టే. 'రక్తచరిత్ర'లో ఆమెను చూసినప్పుడు ఈమె ఎంతో వైవిధ్యంగా, సింపుల్ పాత్రలలో కూడా మెప్పించగలదని అందరూ అనుకున్నారు. ఇక ఆమె తెలుగులో బాలకృష్ణ సరసన కూడా రెండు చిత్రాలలో నటించింది. దేశవిదేశాలలో, అన్నిభాషల్లో విడుదలైన రజనీకాంత్ 'కబాలి' చిత్రంలో రజినీకాంత్ కి భార్యగా నటించి మంచి క్రేజ్ సంపాదించింది. ఇక ఈమె పద్దతి గల పాత్రలు చేస్తుందనే వారికి షాక్‌నిస్తూ ఆమె బాలీవుడ్‌లో బోల్డ్ సీన్స్‌లో రెచ్చిపోయి నటిస్తోంది. ఇక ఫొటోషూట్లకైతే దిమ్మతిరిగే ఫోజులిస్తోంది. మరీ ఇంత ఎక్స్‌పోజింగా? అని ప్రశ్నించిన వారికి నా ఒళ్లు, నా ఇష్టం అని అంటోంది. అంతవరకు బాగానే ఉన్నా ఆమద్య మలయాళ నటి వేధింపులు, కిడ్నాప్ ఉదంతం తర్వాత స్వయాన శరత్‌కుమార్ కూతురైన వరలక్ష్మి నుంచి ఎందరో సినిమాలలో నటించేటప్పుడు లైంగిక వేధింపులు ఎదురయ్యాయని, అవకాశాలు రావాలంటే పడక సుఖం ఇవ్వమంటారని బహిరంగంగానే ఎందరో నటీమణులు ఒప్పుకున్నారు.
కానీ వీరందరికంటే ముందే ఈ సినిమా అవకాశాల కోసం లైంగికవేధింపులు తెలుగులో ఎక్కువ అని స్టేట్‌మెంట్ ఇచ్చింది ఈ ఫైర్‌బ్రాండ్. దాంతో ఎవరా హీరో? ఎవరా నిర్మాత? అని అందరికి సందేహాలు వచ్చాయి. ఇక ఈ విషయం ఇప్పుడు దాదాపుగా సద్దుమణుగుతున్న సమయంలో ఆమె మరలా దక్షిణాదిపై తీవ్ర ఆరోపణలు చేసింది. దక్షిణాదిలో అవకాశం ఇవ్వాలంటే లైంగిక సుఖం కోరుకుంటారని చెప్పి, మొదట్లో ఓ తెలుగు హీరో అని చెప్పిన ఆమె తాజాగా 'ఓ నిర్మాత నన్ను స్టోరీ డిస్కషన్స్ కోసం పిలిచి పడకసుఖం కోసం ఒత్తిడి తెచ్చాడని, కానీ తాను దానిని తిరస్కరించి వచ్చానని' మరోసారి వివాదాన్ని రేపింది. ధైర్యం ఉంటే ఆ హీరో ఎవరు? ఆ నిర్మాత ఎవరో చెప్పాలి గానీ ఓ నిర్మాత, ఓ హీరో అంటే మాత్రం జనాలు అందరినీ అనుమానించే స్థితి వస్తుంది. కాబట్టి ఇంత విషయాన్ని ధైర్యంగా చెప్పిన ఆమె వారు ఎవరో చెబితే పదిమంది కొత్తగా వచ్చే నటీమణులకు మేలు చేసినట్లు అవుతుంది. అంతేగానీ ఇలా పబ్లిసిటీ కోసం ఒక నిర్మాత, ఒక హీరో అని చెప్పడం మాత్రం సరికాదని చెప్పాలి.