Advertisement
Google Ads BL

రితికాసింగ్‌ రూటే వేరప్పా..!


బాక్సింగ్‌ బ్యూటీ రితికాసింగ్‌కి గురు హిట్ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని తమిళ శివలింగతో తెలుగులోనూ కనిపించింది. అయితే ఆ రెండు సినిమాలు వచ్చి చాలా కాలమే అవుతుంది. కానీ ఇప్పటివరకు రితికాసింగ్‌ మరో మూవీ పట్టాలెక్కలేదు. ఈలెక్కన తెలుగులో ఈ భామకి భారీ గ్యాప్ వచ్చేసినట్టే. మరి రెండు సినిమాలు హిట్ ఉన్నప్పటికీ కూడా రితిక కి ఇంతవరకు స్టార్ హీరోల పక్కన భారీ అవకాశాలు రాలేదు. కారణం రితికాసింగ్‌ కి హీరోయిన్ కుండాల్సిన గ్లామర్ లేదనే టాక్ ఉంది. ఆమె అబ్బాయి మాదిరిగా ఉంటుందని హీరోయిన్ మాదిరిగా గ్లామర్ షో ఏం చేస్తుంది అంటున్నారు.

Advertisement
CJ Advs

అయితే ఇప్పుడు రితికాసింగ్‌ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలి అంటే ఏదో ఒకటి చెయ్యాలి అని కాదు... ప్రస్తుతానికి హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలో నటించాలని ఫిక్స్ అయ్యిందట. సౌత్ టాప్ హీరోయిన్ నయనతార లాగా లేడి ఓరియెంటెడ్ చిత్రాలతో క్రేజ్ సంపాదించాలని చూస్తుందట. తమిళంలో నయనతార లేడీ ఓరియెంటెడ్ మూవీస్ తో ఎంతగా ఫేమస్ అయ్యిందో తెలిసిందే. ఆమె అలా లేడి ఓరియెంటెడ్ మూవీస్ లో నటిస్తూనే స్టార్ హీరోల పక్కన ఛాన్స్ లు కొట్టేస్తూ విజయపధంలో దూసుకుపోతూ అందరికన్నా ఎక్కువ పారితోషికం అందుకుంటూ టాప్ ప్లేస్ లో కూర్చుంది.

ఇక నయనతారలాగే రితిక కూడా లేడి ఓరియెంటెడ్ చిత్రాలతో ఫేమస్ అవ్వడానికి రెడీ అవడమే కాదు అప్పుడే ఒక సినిమాని కూడా లైన్ లో పెట్టేసిందట. అయితే తెలుగు, తమిళంలో తెరకెక్కబోయే ఈ సినిమాలో రితికాసింగ్ ఓ క్యాబ్ డైవర్ పాత్రలో కనిపించనుందట. మరి ఈ సినిమాతో రితిక ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూద్దాం.

Ritika Singh In Lady Oriented Movie:

Guru Movie Heroine Ritika Singh Follows Nayanathara Foot Steps
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs