Advertisement
Google Ads BL

కళాకారులని కూడా చూడరు.. కాల్చేస్తారు!


మనోభావాల పేరుతో, ఇతర విధాలుగా సినిమా ఇంకా మొదలు పెట్టకముందే తమ అభిమాన వ్యక్తులను ఎలా చూపిస్తారో? అని ఏమీ తెలియకుండా, సినిమా చూడకుండానే దాడులు చేసే సంస్కృతి మన దేశంలో కూడా పెరిగిపోతోంది. రాజ్‌పుత్‌రాణి పద్మావతికి, ఆమె విరోధి, ఆమెను వశం చేసుకోవాలనుకున్న అల్లావుద్దీన్‌ఖిల్జీకి లొంగిపోకుండా సజీవ దహనం చేసుకున్న వీరవనిత పద్మావతిని తప్పుగా చూపిస్తున్నారంటూ సినిమా షూటింగ్‌లో ఎలా తీస్తున్నారో తెలియకుండానే కర్ణిసేన కార్యకర్తలు దాడి చేశారు. ఒక కోట, సత్యనారాయణ వంటి వారితో పాటు ఇప్పుడు వర్మ తీయనున్న 'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌' విషయంలో ఇదే రచ్చ జరుగుతోంది. 

Advertisement
CJ Advs

ఇక ముస్లిం సంప్రదాయ దేశాలలో అయితే కళాకారులపై మత పెద్దలు తీసుకుంటున్న నిర్ణయాలు, ఫత్వాలు జారీ చేసి, ఫలానా నటిని చంపితే ఇంత బహుమతి ఇస్తామని బహిరంగంగానే చెప్పేస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్‌, పాకిస్తాన్‌ వంటి దేశాలలో ఆడవారిపై ఎన్నో ఆంక్షలు ఉన్నాయి. ఇతర గీతాలు పాడకూడదని, నటీమణులుగా నటించకూడదని, చదువుకోరాదని, బురఖా విధిగా ధరించాలని ఆంక్షలు విధిస్తూ వాటిని పట్టించుకోని వారిని హతమారుస్తున్నారు. 

విషయానికి వస్తే తాజాగా పాకిస్తాన్‌ లోని పంజాబ్‌ ప్రావిన్స్‌ ప్రాంతానికి చెందిన షమీమ్‌ అనేకళాకారిణిని కొందరు దుండగులు కాల్చి చంపారు. ఆమెను బయటికి రమ్మని చెప్పి ఫోన్‌ చేసిన అగంతకులు ఆమె ఇంటి బయటికి రాగానే తుపాకులతో కాల్చి చంపేశారని ఆమె సోదరుడు పోలీస్‌లకు ఫిర్యాదు చేశాడు. ఇక ఆమె ప్రముఖ పాకిస్థాన్‌ థియేటర్‌ ఆర్టిస్టు. ఆమె డ్రామాలు వేసేటప్పుడు కూడా ఆమెను పలువురు నటించడానికి వీలు లేదని లేకపోతే చంపేస్తామని బెదిరింపులు కూడా చేసేవారట. ఇక ఆమె పెళ్లి చేసుకుని ప్రస్తుతం భర్తతో విడిపోయి జీవిస్తోంది. దాంతో ఆమె భర్త ఏమైనా చేశాడా? లేక ఆమె నటించడమే ఆమె ప్రాణాలు తీసిందా? అనేవి తేలాల్సివుంది..! 

Pakistani Theatre Actress shot dead in Multan:

No Security to Celebrities in Pakistan
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs