Advertisement
Google Ads BL

హరితేజైనా నిండుగా కనిపిస్తుందా?


నేడు బుల్లితెరపై కనిపించే వారికి కూడా వెండితెరపై వెలుగుతున్న వారి స్థాయిలో క్రేజ్‌, ఇమేజ్‌ లభిస్తున్నాయి. దీనికి సుమ, ఝాన్సీ, ఉదయభాను, అనసూయ, రేష్మి వంటి వారే ఉదాహరణ. ఇక మొదట్లో వెండితెరపై చిన్నచిన్నవేషాలు వేయడం, ఆ తర్వాత బుల్లితెరకు వచ్చి ఓ షోకి హాట్‌ యాంకర్‌గా చేస్తే మరలా సినిమా వారి దృష్టిలో పడి పెద్ద  ఛాన్స్‌లు, క్రేజీ ఆఫర్స్‌ దక్కించుకుంటున్నారు. ఇక విషయానికి వస్తే ఈటీవీలో ప్రసారమవుతున్న 'జబర్దస్త్‌' షోకి ఎంత పాపులారిటీ ఉందో.. అంతకు మించిన వివాదాలు కూడా ఉన్నాయి. 

Advertisement
CJ Advs

హాట్‌యాంకర్లయిన అనసూయ,రేష్మిల గ్లామర్‌షో, వారు వేసే జోకులు, ఇక స్కిట్‌లో వచ్చే ద్వందార్దాలు, పలువురిని కించపరిచేలా పేరడీలు చేస్తుండటంతో ఆ షో వివాదాలకు ఎక్కింది. అందునా ఈ షోకి కాస్త ప్రజాదరణ కూడా తగ్గుతోందని, యూత్‌ చూస్తున్నా కూడా ఫ్యామిలీస్‌ కాస్త ఇబ్బంది పడుతున్నాయనే వాదన ఉంది. దీంతో ఈ షో నిర్వాహకులైన మల్లెమాల సంస్థ ఈ షోలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టనుందని సమాచారం. అందులో భాగంగా టీవీ షోలతోనే కాదు... వెండితెరపై కూడా పలు చిత్రాలలో నటించి, ముఖ్యంగా త్రివిక్రమ్‌ తీసిన 'అ..ఆ' చిత్రంతో గుర్తింపు తెచ్చుకుని 'బిగ్‌బాస్‌' లో తన స్టైల్‌లో మెప్పించి క్రేజ్‌ తెచ్చుకున్న హరితేజని ఈ షోకి కొత్త యాంకర్‌గా తీసుకోనున్నారని సమాచారం. 

ఆ షోకి ఉన్న ప్రజాదరణ చూసి హరితేజ కూడా దీనికి ఓకే చెప్పిందని అంటున్నారు. మరోవైపు బిగ్‌బాస్‌ సీజన్‌2కి రేష్మి ఎంపికైందని, అందువల్లే ఆమే స్వయంగా ఈ షో నుంచి బయటికి వచ్చినట్లు మరో వాదన కూడా వినిపిస్తోంది. మొత్తానికి కనీసం హరితేజ అయినా నిండుగా, తనదైన సమయస్ఫూర్తితో ఈ షోని రక్తి కట్టించి, మరలా ఫ్యామిలీ వీక్షకులను కూడా ఆకట్టుకుంటుందో లేదా పాతవారి తరహాలోనే నడుస్తుందో వేచిచూడాల్సివుంది...!

Hariteja Selected for Rashmi's Extra Jabardasth:

Hariteja Dress Hot Topic for Extra Jabardasth
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs