'సూపర్' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మంగళూరు భామ అనుష్క ఆతర్వాత గ్లామర్ పాత్రలు బాగానే పోషించి మెప్పించింది. అదే సమయంలో ఆమె నటించిన 'అరుంధతి' చిత్రంతో ఆమె కెరీర్ ఒక్కసారిగా మారిపోయింది. ఆమెకు ఎక్కువగా లేడీ ఓరియంటెండ్ పాత్రలే వస్తున్నాయి. గ్లామర్ పోషించే పాత్ర అయినా సరే నటనకు కూడా ఆమెకు స్కోప్ ఉండే పాత్రలు వెతుక్కుంటూ వస్తున్నాయి. అనుష్క కూడా అటు గ్లామర్ పాత్రలను, ఇటు లేడీ ఓరియంటెడ్, నటనకు స్కోప్ ఉన్న పాత్రలను సమపాళ్లలో రంగరించి తెలివిగా తన స్టార్‌డమ్‌ని కాపాడుకుంటూ వస్తోంది. నాటి విజయశాంతి తర్వాత ఆ స్థానం అనుష్కదే అని కొందరి మాట. ఇక ఇన్నేళ్లుగా ఈ యోగా టీచర్ తన గ్లామర్‌ని మెయిన్‌టెయిన్ చేస్తూ రావడం కూడా సామాన్యమైన విషయం కాదు.
ఇక అంతకు ముందు కేవలం ఫేడవుట్ అయ్యే భామలకే హీరోయిన్ ఓరియంటెడ్ పాత్రలు వస్తాయనే వాదనను కూడా తప్పు అని ఈమె నిరూపించింది. కాగా 'సైజ్ జీరో' మాత్రం ఆమెని ఇబ్బందుల్లో పడేసింది. తనకున్న యోగాతో బరువు పెరిగి వెంటనే తగ్గడం కూడా సులువేనని భావించిన ఆమె 'సైజ్ జీరో' కోసం భారీగా బరువు పెరిగింది. కానీ తర్వాత ఆమె తన పూర్వ స్థితికి రాలేకపోయింది. రాజమౌళి సైతం ఆమెను 'బాహుబలి' షూటింగ్ సమయంలో లావుగా ఉన్నందుకు చీవాట్లు పెట్టాడని వార్తలు వచ్చాయి. ఎలాగోలా రాజమౌళి గ్రాఫిక్స్‌లో, విఎఫ్‌ఎక్స్‌లో .. మొత్తానికి ఏదో మాయ చేసి తన 'బాహుబలి' లో ఆమెను నాజూకుగానే చూపించాడు. ఇక ప్రస్తుతం ఆమె నటిస్తున్న ఒకే ఒక్క చిత్రం యువి క్రియేషన్స్ బేనర్‌లో 'పిల్లజమీందార్' ఫేమ్ అశోక్ దర్శకత్వంలో రూపొందుతున్న 'భాగమతి'. ఈచిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇక రాజమౌళిలా తాను కూడా అనుష్కను నాజూకుగా చూపించేందుకు దర్శకుడు అశోక్ ముంబైలో గ్రాఫిక్స్ బిజీలో ఉన్నాడు. ఇది మినహా ఈమె చేతిలో ఒక్క చిత్రం కూడా లేదు. కేవలం తెలుగులోనే కాదు తమిళంలో కూడా ఈమెకు అవకాశాలు లేవు. కానీ 'సాహో' సమయంలో అనుష్కనే ఈ చిత్రం పెట్టుకుంటారని వార్తలు వచ్చాయి. కానీ ఓ మీడియా సంస్థ మాత్రం అనుష్క తాను పలు తమిళ కమిట్‌మెంట్స్‌తో ఉన్నందు వల్ల 'సాహో'కి డేట్స్ ప్రాబ్లమ్ వస్తాయి కాబట్టి చేయలేనని ఆమె స్వయంగా చెప్పిందంటూ చెప్పింది.
కానీ అది నిజం కాదని ఇప్పుడు తెలుస్తోంది. మరోపక్క ఇటీవల రాశిఖన్నా కేరళ వైద్యంలోని వెయిట్‌లాస్ ద్వారా కొంత బరువు తగ్గడంతో, తన యోగా ద్వారా తగ్గడం కష్టమని భావించి, ప్రస్తుతం అనుష్క కేరళకి వెళ్లి అక్కడ ట్రీట్‌మెంట్ చేయించుకుంటోందని వార్తలు వస్తున్నాయి. ఇక మెగాస్టార్ 'సై..రా.. నరసింహారెడ్డి'లో నయనతార, ప్రగ్యాజైస్వాల్‌లతో పాటు ఐశ్వర్యారాయ్, అనుష్కలు కూడా నటిస్తారని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈచిత్రం ప్రీప్రొడక్షన్ పనుల్లో ఉంది. దీపావళి తర్వాత గానీ ఈచిత్రంలో అనుష్క ఉంటుందా? లేదా? అనేది తేలదు. మరి ఆమె వివాహం చేసుకోదలుచుకుని సినిమాలు ఒప్పుకోవడం లేదా? లేక బరువు కారణమా? బరువు తగ్గితే మరలా నటిస్తుందా? అనేవన్నీ ప్రశ్నార్ధకాలే.