Advertisement
Google Ads BL

రాజాలో గ్రేట్ ఎవరో తెలుసా?


హీరోయిన్స్‌లో ఎవరు గ్రేట్‌ అనే విషయానికి వస్తే పల్లెటూరి గ్రామీణ పాత్రలు, దుస్తులు, మోడ్రన్‌ డ్రస్‌లు, మోడ్రన్‌ లుక్స్‌, అభినయం, అలాగే గ్లామర్‌షో, హాస్యం, రుణరసం,శృంగారం, చిలిపిదనం వంటివన్నీ సమపాళ్లలో మెప్పించగలిగిన వారే నిజమైన నటీమణులు. ఆ విషయంలో నిన్నటితరంలో విజయశాంతి, భానుప్రియ, రాధికా వంటి వారిని ముఖ్యంగా చెప్పవచ్చు. ఇక రాధిక విషయానికి వస్తే ఆమె నిజ జీవితంలో కూడా అల్లరి పిల్ల. అందరినీ ఆటపట్టిస్తూ, ఏడిపిస్తూ షూటింగ్‌లలో నాడు గోల గోల చేసేంది. అందునా మహా మొండిఘటం. డేరింగ్‌ అండ్‌ డాషింగ్‌, నాడు ఎమ్జీఆర్‌ పైనే కాల్పులు జరిపిన ఎం.ఆర్‌.రాధా కుమార్తె ఆమె. 

Advertisement
CJ Advs

ఇక ఆమె తెలుగులో పల్లెటూరి పాత్రలు,అల్లరి పాత్రలు, కామెడీ పాత్రలు, బరువైన పాత్రలు ఎన్నో చేసింది. ఇక చిరంజీవితో ఆమె కలిసి చేసిన చిత్రాలలో వారి కెమిస్ట్రీ అదిరిపోయేది. 'దొంగమొగుడు'తో పాటు పలు చిత్రాలలో ఆమె చిరంజీవికి తగ్గని రేంజ్‌లో హాస్యాన్ని పలికింది. ఇక శరత్‌కుమార్‌ని వివాహం చేసుకుని రాడాన్‌ మీడియా సంస్థను స్థాపించిన ఆమె వెండితెరపై కనిపించడం తగ్గించేసింది. బుల్లితెరపై మాత్రం బరువైన పాత్రలు పోషిస్తూ ఉంది. కానీ తాజాగా ఆమె రవితేజకి తల్లి పాత్రలో దిల్‌రాజు నిర్మాణంలో అనిల్‌రావిపూడి దర్శకత్వంలో త్వరలో విడుదల కానున్న 'రాజా ది గ్రేట్‌' లో అంధుడైన రవితేజని విపరీతంగా గుడ్డిగా నమ్మే పాత్రలో చేస్తోంది. 

ఇక ఇందులో ఆమెది మంచి కామెడీ పాత్ర అని, ఆమె చేసే హాస్యం అందరినీ మెప్పింస్తుందని దర్శకుడు అనిల్‌రావిపూడి ఎంతో నమ్మకంగా ఉన్నాడు. అంతేకాదు.. రాధికాకి, కమెడియన్‌ శ్రీనివాసరెడ్డికి మధ్య వచ్చే కామెడీ ట్రాక్‌ హైలైట్‌ అంటున్నాడు. అనిల్‌రావిపూడి 'పటాస్‌'లో సైతం శ్రీనివాసరెడ్డి ఫుల్‌లెంగ్త్‌ క్యారెక్టర్‌లో కామెడీని అద్భుతంగా పడించాడు. మరి రాధిక చేసే కామెడీకి శ్రీనివాసరెడ్డి, రవితేజల ఎనర్జీ కూడా కలిస్తే దీపావళి టపాసులు అన్ని థియేటర్లలలో మోగడం ఖాయమని చెప్పవచ్చు.

Radhika Great in Raja The Great:

Radhika performance Highlites in Ravi teja Movie Raja The Great
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs