Advertisement
Google Ads BL

తెరాస వాడకం: సమంత దానికి, రకుల్ దీనికి!


తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటినుండి సీఎం కేసీఆర్ తనదయిన స్టయిల్లో ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు.  పెత్తనమంతా తన చేతుల్లోనే ఉంచుకుని వన్ మాన్ ఆర్మీలా ప్రభుత్వాన్ని ఏకచత్రాధిపత్యంగా ఏలుతున్నారు. ఒకవైపు కొడుకు కేటీఆర్ ని, మరొకవైపు కూతురు కవితని, ఇంకొకవైపు అల్లుడు హరీష్ రావుని పెట్టుకున్నకేసీఆర్ ప్రతి విషయంలోనూ దూకుడు ప్రదర్శిస్తున్నారు. అయితే తమ ప్రభుత్వానికి సినీ తారల అవసరం కూడా ఉందంటూ చెప్పకనే చెబుతున్నారు కేసీఆర్. సినిమా పరిశ్రమకు అన్ని విధాలా ఆదుకుంటామని చెబుతున్న కేసీఆర్ సినిమా పరిశ్రమని ఎక్కడికి తరలి పోనివ్వమని మాటిస్తున్నారు. అలాగే సినిమా తారలతో తమకి కావాల్సిన పనులను కూడా చేయించేసుకుంటూ వారిని ఎలా వాడాలో అలా వాడేస్తున్నారు.

Advertisement
CJ Advs

ఇంతకుముందు టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంతని తెలంగాణ చేనేత వస్త్రాలకు బ్రాండ్ అంబాసిడర్ గా ప్రకటించింది కేసీఆర్ ప్రభుత్వం. ఆ చేనేత వస్త్రాలకు బ్రాండ్ అంబాసిడర్ గా సమంత కూడా సమర్ధవంతమగానే పనిచేస్తూ వస్తుంది. వీలున్నప్పుడల్లా చేనేత వస్త్రాలను ధరించడమే కాదు అప్పుడప్పుడు... కేసీఆర్ ప్రభుత్వాన్ని పొగిడేస్తూ పబ్లిసిటీ చేసేస్తుంది. ఇప్పుడు కూడా తాజాగా మరో టాప్ హీరోయిన్ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ని తెలంగాణ రాష్ట్రం 'భేటీ బచావో భేటీ పడావో' కార్యక్రమానికి బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఎంపిక చేసింది.

మరి రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు టాలీవుడ్ లో నెంబర్ 1 పొజిషన్ లో ఉంది. అలాంటి హీరోయిన్ ని తీసుకొచ్చి తెలంగాణ  ప్రభుత్వం భేటీ బచావో భేటీ పడావోకి బ్రాండ్ అంబాసిడర్ ని చేసింది. మరి రకుల్ ప్రీత్ సింగ్ కేవలం బ్రాండ్ అంబాసిడర్ గా పనిచెయ్యడమేకాదు... వీలు చిక్కినప్పుడలా తనకి ఇంతటి మహోన్నతమైన పనిని అప్పజెప్పినందుకు కేసీఆర్ ని, తెలంగాణ ప్రభుత్వాన్ని పొగిడేస్తూ మునగచెట్టెక్కించే పని పెట్టుకుంటుందన్నమాట. మరి తెలంగాణ ప్రభుత్వం సినిమా తారల్ని ఎలా వాడాలో అలా వాడి తమకు కావాల్సినంత క్రేజ్ సంపాదించేస్తోంది. 

Beti Bachao Beti Padhao:

Rakul Preet Singh is appointed as the brand ambassador of Telangana for the Beti Bachao Beti Padhao campaign
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs