Advertisement
Google Ads BL

ఎన్టీఆర్ లా మహేష్ కోరుకుంటున్నాడు!


'జై లవ కుశ' విడుదలకు ముందు నుండే ఎన్టీఆర్ పిఆర్ టీమ్ సూపర్ అంటూ సోషల్ మీడియాలో కథనాలు వచ్చేలా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు.  ఎందుకంటే జై లవ కుశ సినిమాకి ముందు నుండే ఎన్టీఆర్ చక్కటి పిఆర్ టీమ్ ని రెడీ చేసుకుని తన వ్యవహారాలను మీడియా కి ఎప్పుడు అందించాలో లాంటి  విషయాల్లోనే కాక ఎన్టీఆర్ ఎక్కడ ఎలా మెసులుతున్నాడో.. ఎప్పటికప్పుడు ఎన్టీఆర్ కి చేరవేస్తూ.. అందులో తప్పులుంటే సరిదిద్దుకునేలా చూడడం వంటి విషయాలలో కూడా  చురుగ్గా ఉందంటూ రకరకాల కథనాలు తాజాగా వెలువడుతున్నాయి. ఇక 'జై లవ కుశ' ఫస్ట్ లుక్ పోస్టర్ దగ్గర నుండి సినిమా విడుదల వరకు ఈ పిఆర్ టీమ్ ఎన్టీఆర్ కి అన్ని విధాలా సపోర్ట్ చేస్తూ ఎన్టీఆర్ ని అందనంత ఎత్తులో నిలబెట్టారు. ఎన్టీఆర్ మీద నెగెటివ్ కామెంట్స్ పడగానే వాటిని ఎన్టీఆర్ దృష్టికి తీసుకెళ్లడం దగ్గర నుండి ప్రతి ఒక్క విషయాన్నీ ఎన్టీఆర్ కి చేరవేసి సకాలంలో డ్యామేజ్ జరక్కుండా కాపాడారని టాక్ వుంది. అలాగే ఎన్టీఆర్ హోస్ట్ చేసిన బిగ్ బాస్ విషయంలో కూడా ఎన్టీఆర్ కి సోషల్ మీడియాలో వచ్చిన క్రేజ్ కి కారణం ఎన్టీఆర్ స్పెషల్ పిఆర్ టీమంటూ వార్తలొస్తున్నాయి.

Advertisement
CJ Advs

అయితే ఇప్పుడు స్పైడర్ తో దెబ్బతిన్న మహేష్ కి ఇలాంటి ఒక పిఆర్ టీమ్ లేకపోవడం వలెనే మహేష్ మీద కొన్ని వెబ్సైట్ నెగటివ్ గా వార్తలు రాయడం దగ్గరనుండి.... కలెక్షన్స్ విషయంలో నిర్మాతలు బయటికి పంపే ఫిగర్స్ ని ఎక్కిరించడం జరుగుతున్నాయనే విషయాన్ని మహేష్ తెలుసుకున్నాడట. మహేష్ మీద కొన్ని వెబ్సైట్ నెగెటివ్ గా రాయడం మాత్రమే కాదు.. సోషల్ మీడియాలో కూడా సెటైర్స్ వెయ్యడం వంటి విషయాలతో మహేష్ బాగా ఫీల్ అవుతున్నాడని ఫిలింనగర్ లో గుసగుసలు వినబడుతున్నాయి. అందుకే ఇప్పుడు ఎన్టీఆర్ కి లాగే తనకి ఒక స్పెషల్ పిఆర్ టీమ్ ఉంటే బావుంటుందని ఆలోచనలో మహేష్ ఉన్నాడంటున్నారు.

ఎన్టీఆర్ విషయంలో పిఆర్ టీమ్ ఎంత ఎఫర్ట్ పెట్టి ఎన్టీఆర్ ని నలువైపులా కాచిందో అలాంటి పిఆర్ టీమ్ ని సెట్ చెయ్యమని మహేష్ బాబు సన్నిహితులకు చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే మహేష్ మీద కొన్ని వెబ్సైట్ పనిగట్టుకుని చేస్తున్న నెగెటివ్ ప్రచారానికి మహేష్ అండ్ టీమ్ వాటిని కట్టడి చేసే ప్రయత్నాలు స్టార్ట్ చేసినట్లుగా చెబుతున్నారు. 

Super Star Mahesh Babu in Jr NTR Route:

Super Star Mahesh Babu wants Special PR Team like NTR
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs