Advertisement
Google Ads BL

ఇప్పుడు సంతోషమేనా రాయ్ లక్ష్మి..!


బాలీవుడ్ సినిమా మీద బోలెడన్ని అసలు పెట్టుకున్న సౌత్ సుందరి లక్ష్మి రాయ్ కి అక్కడ ఎదురుదెబ్బ తగిలింది. లక్ష్మి రాయ్ నటించిన 'జూలీ 2'  సినిమా ట్రైలర్ తోనూ, లక్ష్మి అందాల బికినీ ఫొటోస్ తోనూ సినిమాపై మంచి అంచనాలు పెంచేసింది. అయితే ఈ చిత్రం ఇప్పటికే థియేటర్లలోకి వచ్చేసి సందడి చెయ్యాల్సింది. ముందుగా అక్టోబర్ 6న లక్ష్మి రాయ్ 'జూలీ 2' సినిమా విడుదల అని మేకర్స్ ప్రకటించారు. కానీ సైఫ్ అలీఖాన్ నటించిన 'చెఫ్' సినిమా నుంచి వస్తున్న పోటీని తట్టుకోలేకపోవడం నిర్మాత సైడ్ నుండి వివాదాలు.... చాలా ప్రాంతాల్లో 'జూలీ 2' బిజినెస్ పూర్తికాకపోవడం వంటివి లక్ష్మీరాయ్ నటించిన ఈ సినిమాను ఆఖరి నిమిషంలో వాయిదా వేయడానికి కారణం అయ్యాయి. 

Advertisement
CJ Advs

అయితే అప్పుడు అలా వాయిదాపడిన 'జూలీ 2' సినిమాకు తాజాగా మరో రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారట. వచ్చేనెల అంటే నవంబర్ 10న ఈ 'జూలీ 2'  సినిమాను థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్టు సినిమా ప్రజెంటర్.... మాజీ సెన్సార్ బోర్డ్ చైర్మన్ పహ్లద్ నిహలానీ ప్రకటించాడు. మరి ఈ సినిమాతో హిట్ కొట్టేయాలని బాలీవుడ్ లో పాతుకుపోవాలని... చూసిన లక్ష్మి రాయ్ కి సినిమా వాయిదాతో ఖంగుతింది. ఈ సినిమాతో బాలీవుడ్ లో చక్రం తిప్పుదామనుకున్న లక్ష్మికి ఆదిలో హంసపాదు ఎదురైనా మళ్ళీ మరో అవకాశం వచ్చింది. సో.. లక్ష్మి రాయ్ అందాల విందు కనులారా వీక్షించాలంటే నవంబర్ 10  వరకు వెయిట్ చేస్తే చాలన్నమాట.

ఇక 'జూలీ 2'  ప్రమోషన్స్ లో ఈ సినిమా అడల్ట్ సినిమాగా కనిపిస్తున్నప్పటికీ.... ఈ సినిమాలో మంచి సందేశం ఉందంటోంది అంటుంది చిత్ర బృందం.  మరోవైపు లక్ష్మీ రాయ్ కూడా తన కెరీర్ లోనే బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చానంటోంది. సినిమాలో కేవలం తనను ఎక్స్ పోజింగ్ యాంగిల్ లోనే చూడకుండా... ఎమోషనల్ యాంగిల్ లో చూడాలని మొదటినుండి రిక్వెస్ట్ చేస్తోంది. లక్ష్మీరాయ్ కు ఇదే మొదటి బాలీవుడ్ సినిమా కావడంతో.. సినిమా ప్రచారం కోసం బాగానే కష్టపడుతోంది అమ్మడు. 

Raai Laxmi Julie 2 Release On November 10:

Raai Laxmi Julie 2 Movie New Release Date Fixed
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs