Advertisement
Google Ads BL

హృతిక్‌రోషన్‌-కంగనా యవ్వారం ముదురుతోంది!


మొత్తానికి కంగనారౌనత్‌, హృతిక్‌రోషన్‌ల వివాదం పుణ్యమా అని ఓ కొత్త చర్చ మొదలైంది. ప్రపంచమంతా, మరీ ముఖ్యంగా చెప్పాలంటే మన దేశంలో ఆడవారిపై అఘాయిత్యాలు పెరిగిపోతున్న విషయం తెలిసిందే. అదే సమయంలో నన్నుప్రేమించు... లేకపోతే యాసిడ్‌ పోస్తాం.. చంపేస్తామని మగవారు బెదిరిస్తున్నట్లుగానే ఆడవాళ్లు కొన్ని రకాల చట్టాలతో కక్ష్య సాధింపు చర్యలు చేపడుతున్నారు. పెళ్లైన వెంటనే తల్లిదండ్రులను వదిలేసి స్వేచ్చగా సొంత కాపురాలు పెట్టాలని కోరుకుంటున్నారు. మా తల్లిదండ్రులను కూడా బాగా చూసుకోవాలి అని చెప్పే బదులు మీ తల్లిదండ్రులు కాదు. మా తల్లిదండ్రులనే చూడాలని శాసిస్తున్న మహిళలు, ఇంకా అనవసరంగా ఏదో విధంగా కక్ష్య తీర్చుకోవడం కోసం కట్న వేధింపుల కేసుల నుంచి దౌర్జన్యం, అఘాయిత్యం, అత్యాచారం, నిర్భయ చట్టాలలో చాలా వాటిని ఆడవారు పావులా వాడుకుంటున్నారు. 

Advertisement
CJ Advs

ఇక విషయానికి వస్తే బాలీవుడ్‌లో హృతిక్‌, కంగనా వివాదంలో పలువురు సినీ ప్రముఖులు హృతిక్‌రోషకే మద్దతు ఇస్తున్నారు. ఫర్హాన్‌అక్తర్‌ దీని గురించి ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ పెడుతూ, తన సహనటుడు ఒక నటి మీద ఇంత దుర్మార్గంగా ప్రవర్తించాడంటే నమ్మను. ఈ విషయంలో మాట్లాడే హక్కు నాకులేదు. సైబర్‌ క్రైమ్‌ డిపార్ట్‌మెంట్‌ దానిని చూసుకుంటుంది. కానీ ఒక్క మాట మాత్రం చెప్పదలుచుకున్నాను. మహిళలపై అఘాయిత్యాలు ఎక్కువగా జరుగుతున్నది నిజమే అయినా ప్రతి విషయంలోనూ మగవారిదే తప్పనడం సరికాదు. మగవారిపై ఎన్నో అకృత్యాలు జరుగుతున్నాయి. వారు బాధలు అనుభవిస్తున్నారు. దీనిని న్యాయస్థానాలు కూడా ఒప్పుకున్నాయి. హృతిక్‌ ని చూసి స్పందించాల్సి వస్తోంది. ఆయనది తప్పు లేదు. కేవలం మహిళ అన్న కోణంలో కంగనాకు మీడియా మద్దతుగా నిలిచి, హృతిక్‌ని దోషి అని సీనియర్‌ పాత్రికేయులు కూడా తీర్పు చెప్పడం సరికాదు.. అని అన్నాడు.  

ఫర్హాన్‌అక్తర్‌ వ్యాఖ్యలకు సోనమ్‌కపూర్‌, ట్వింకిల్‌ ఖన్నా, యామీ గౌతమ్‌, కరణ్‌జోహార్‌, సోనాలి బింద్రే, సోనమ్‌ కపూర్‌ లు కూడా మద్దతు పలికారు. కానీ ఈ విషయంలో కంగనా కంటే ఎక్కువగా స్పందిస్తున్న ఆమె సోదరి రంగోళి 'ఫర్హాన్‌...మీరు రోషన్‌ ఫ్యామిలీకి అండగా నిలబడకుండా ఉండి ఉంటే సంతోషించే దానిని. సినిమా పరిశ్రమ మొత్తం కంగనాకి వ్యతిరేకంగా నిలబడినా కూడా ఆమెదే విజయమని' వ్యాఖ్యానించింది. దీనికి ఓ ఉదాహరణ చెప్పాలంటే కంగనారౌనత్‌ తాను లైంగిక వేదింపులకు గురయ్యానని చెప్పినప్పుడు మీడియా అంతా ఆమెను సపోర్ట్‌ చేసింది. అదే అక్షయ్‌కుమార్‌ తన మీద కూడా లైంగిక వేధింపులు జరుగుతున్నాయని చెప్పినా అసలు మీడియా ఆ విషయాన్ని అసలు పట్టించుకోలేదు. 

Bollywood Celebrities Supports Hrithik Roshan in Kangana Issue:

Kangana Issue: Bollywood Celebrities Support to Hero Hrithik Roshan
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs