బాలీవుడ్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో.. దీపికా పదుకొనె లీడ్ రోల్ లో తెరకెక్కుతున్న పద్మావతి చిత్రం ట్రైలర్‌ని చిత్ర యూనిట్ సోమవారం విడుదల చేసింది. దీపికా పదుకొనె పద్మావతిగా టైటిల్ రోల్ పోషిస్తుండగా ఆమె భర్త పాత్రలో షాహిద్ కపూర్..... అల్లావుద్దీన్ ఖిల్జీగా అంటే... విలన్ రోల్ లో రణవీర్ సింగ్ లు నటించారు. పద్మావతి ట్రయిలర్ లో ఈ సినిమా ఎంత భారీగా తెరకెక్కుతుంది అనే విషయం ప్రతి ఫ్రెమ్ లోను అర్ధమవుతోంది. పద్మావతిగా దీపికా చేసిన హావభావాలు, అందం, అభినయం, నటనతో చంపేస్తే ఆమె భర్తగా షాహిద్ కపూర్ కూడా అంతే ఇంట్రెస్టింగ్ గా సైలెంట్ గా ఎమోషనల్ గా కనబడ్డాడు.
ఇక రణవీర్ సింగ్ మాత్రం అల్లావుద్దీన్ ఖిల్జీగా.. భయపెట్టేశాడు. ప్రతి సీన్ లోను అతనిలోని క్రూరత్వాన్ని చూపిస్తూ కట్టిపడేస్తున్నాడు. ఈ సినిమాకి రణవీర్ సింగ్ పాత్ర మాత్రం ప్రాణం పోస్తుందనే చెప్పాలి. ఇక పద్మావతిలో భారీ యుద్ధ సన్నివేశాలు.... చూస్తున్నంతసేపు భయపడడం ఖాయమనే సంకేతాలు పంపేసింది పద్మావతి ట్రయిలర్. మరి ఈ ట్రైలర్ ని ఆధ్యంతం వీక్షించిన టాలీవుడ్ టాప్ డైరెక్టర్ ఒకాయన పద్మావతి పాత్రలను, దర్శకుడిని తెగ పొగిడేశాడు. ఆయనెవరో కాదు బాహుబలితో ప్రపంచ చూపుని తనవైపు తిప్పుకున్న ఎస్ ఎస్ రాజమౌళి. సంజయ్ లీలా భన్సాలి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పద్మావతి ట్రయిలర్ అదుర్స్ అంటున్నాడు ఈ దర్శకుడు.
అత్యద్భుతం... మాస్టర్ సంజయ్ లీలా భన్సాలీ చేత ట్రైలర్‌లోని ప్రతి ఫేమ్ ఎంతో అద్భుతంగా చిత్రీకరించబడింది. భయంకరమైన రణవీర్ సింగ్ లుక్స్ చూడడానికి నా కళ్లు సరిపోలేదు అంటూ ట్వీట్ చేశాడు. మరి దర్శకధీరుడు అలా పొగడడం కాదుగాని పద్మావతి ట్రైలర్ నిజంగా అద్భుతమే. పద్మావతి పాత్రలో దీపికా నటించలేదు జీవించింది. దీపికా అలా ఆకట్టుకుంటే రణవీర్ విలన్ గా అదరగొట్టేస్తున్నాడు. మరి మూడు నిమిషాలకే ఇలా అయితే మూడు గంటల సినిమా ఇంకెలా వుండబోతుందో కదా. పద్మావతి సినిమా ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 1 న విడుదల కాబోతుంది.