Advertisement
Google Ads BL

ఆ చిత్రంతోనే మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందా!


మోక్షజ్ఞ పుట్టినరోజున నందమూరి బాలకృష్ణ కేక్ కటింగ్ తోపాటు మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ 2018  జూన్ తర్వాత ఉంటుందని ప్రకటించాడు. అయితే అప్పటినుండి మోక్షజ్ఞ సినిమా ఎంట్రీకి సంబందించిన న్యూస్ లకు కాస్త బ్రేక్ పడింది. బాలకృష్ణ, మోక్షు గురించి చెప్పకముందు.. అదిగో మోక్షు సినీ రంగప్రవేశం, ఇదిగో మోక్షుని డైరెక్ట్ చేసే డైరెక్టర్ అంటూ రకరకాల కథనాలు ప్రచురితమవుతూ ఉండేవి. కాకపోతే మోక్షజ్ఞ ఎంట్రీ మాత్రం తన తాతగారు ఎన్టీఆర్ బయోపిక్ తో ఉంటుందని నందమూరి అభిమానులు మాత్రం దాదాపు ఫిక్స్ అయ్యారు. 

Advertisement
CJ Advs

ఎన్టీఆర్ బయోపిక్ ని బాలకృష్ణ తెరకెక్కిస్తానని చెప్పడం... ఎన్టీఆర్ చిన్నప్పటి పాత్రతోనే మోక్షజ్ఞ సినీరంగ ప్రవేశం ఉంటుందని అభిమానులే కాదు రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు అనుకుంటున్నారు. ఇకపోతే బాలకృష్ణ, ఎన్టీఆర్ బయోపిక్ ని తేజ డైరెక్షన్ లో తన హోమ్ బ్యానర్ బ్రహ్మతేజ ప్రొడక్షన్స్ లో చేస్తున్నాడనే న్యూస్ సోమవారం సోషల్ మీడియా అంతటా వైరల్ అయ్యింది. తన తండ్రి బయోపిక్ ని తెరకెక్కించడం కోసమే బాలయ్య ఒక సొంత నిర్మాణ సంస్థని రెడీ చేస్తున్నాడని.... దానికి అందంగా బ్రహ్మతేజ ప్రొడక్షన్స్ అని పేరు కూడా పెట్టినట్లుగా చెబుతున్నారు. తన కూతుళ్ళ పేరులోని మొదటి రెండు అక్షరాలతో ఈ బ్యానర్ ఉండటం విశేషం. 

మరి ఎన్టీఆర్ బయో పిక్ స్క్రిప్ట్ ని దాదాపు పూర్తి చేసినట్లుగా చెబుతున్న బాలకృష్ణ ఇంకా తన తండ్రికి సంబందించిన వివరాలు తెలుసుకోవాలని అనుకుంటున్నాడట. అయితే తన 103 వ చిత్రంగా మాత్రం ఎన్టీఆర్ బయోపిక్ ఫిక్స్ అంటున్నాడు బాలకృష్ణ . ఇక త్వరలోనే ఎన్టీఆర్ బయోపిక్ దర్శకనిర్మాతలు, నటీనటుల వివరాలను బాలకృష్ణే స్వయంగా ప్రకటిస్తాడనే సమాచారం అందుతోంది. 

Mokshagna Cine Entry with NTR Biopic:

Mokshagna Cine Entry in Balakrishna own Banner
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs