Advertisement
Google Ads BL

సమంత కొచ్చే ఆఫర్లన్నీ కొట్టేస్తుంది.!


తన టాలీవుడ్‌ కెరీర్‌ని నాగచైతన్య నటించిన 'ఏమాయచేసావే' తో ప్రారంభించి, అదే హీరోతో పెళ్లి పీటలెక్కి అక్కినేని వారి ఇంట సమంత కోడలైపోయింది. పెళ్లి తర్వాత ఆమె నటించడానికి భర్త, మామ అందరూ అభ్యంతరం చెప్పకపోయినా అక్కినేని ఫ్యాన్స్‌ నుంచి ఎలాంటి స్పందన వస్తుందో తెలియాలి. మనకి తెలిసినంతవరకు ఆమె చేస్తున్న 'రాజుగారి గది2' లో ఆమెది పెద్దగా గ్లామర్‌షో లేని పెర్ఫార్మెన్స్‌ ఓరియంటెడ్‌ చిత్రం. ఇక 'మహానటి' అయితే ఏ ఇబ్బంది లేదు. సో.. ఇంతకాలం గ్లామర్‌ని, పెర్ఫార్మెన్స్‌ని సమపాళ్లలో లాక్కొచ్చిన సమంత దీపావళికి విడుదలకానున్న విజయ్‌ 'మెర్సల్‌' చిత్రంలో కాస్త హాట్‌గానే కనిపిస్తోంది. ఇదే చిత్రాన్ని తెలుగులో 'అదిరింది' పేరుతో విడుదల చేయడం కూడా నిర్ణయమైపోయింది. 

Advertisement
CJ Advs

ఈ చిత్రం విడుదలైతే అక్కినేని ఫ్యాన్స్‌లోని మనోభావాలు బయటకు వస్తాయి. మరోవైపు ఆమె సుకుమార్‌, రామచరణ్‌ల 'రంగస్థలం 1985' కూడా త్వరలోనే విడుదల కానుంది. ఇందులో చరణ్‌కి మరదలిగా, సినిమా అంతా చరణ్‌ని బావ..బావ అని పిలిచే పాత్రలో ఆమె నటిస్తోంది. ఇందులో గ్లామర్‌ డోస్‌ మించే అవకాశంలేదు. ఎందుకంటే సుకుమార్‌ ముందుజాగ్రత్తలతో ఈచిత్రాన్ని తీస్తున్నాడు. అయినా మెగా హీరో సరసన అక్కినేని ఇంటి కోడలు నటిస్తే ఫ్యాన్స్‌ రియాక్షన్‌ ఏమిటనేది? కూడా ఆసక్తిరకరమే. 

ఇక విషయానికి వస్తే సమంత తర్వాత ఇటు పర్‌ఫార్మెన్స్‌, అటు గ్లామర్‌తో ఆమెలేని లోటు పూడ్చేదెవరు? అనేదానిపై ఆసక్తికర చర్చ సాగుతోంది. ప్రస్తుతం యంగ్‌స్టార్స్‌ ఎక్కువగా అనుఇమ్మాన్యుయేల్‌, మెహ్రీన్‌లపై చూపుసారిస్తున్నారు. అయినా మీడియం, లో రేంజ్‌ హీరోలు మెహ్రీన్‌తో సర్దుకుపోతారని స్టార్స్‌ మాత్రం అను ఇమ్మాన్యుయేల్‌ వైపు చూస్తారనే చర్చ  సాగుతోంంది. ఈమె మరీ కీర్తిసురేష్‌లా మడికట్టుక్కుని కూర్చోలేదు. అలాగని అనుపమ పరమేశ్వరన్‌లా పొట్టి అనే సమస్య తలెత్తదు కాబట్టే ఇప్పడు పవన్‌, త్రివిక్రమ్‌ చిత్రంలో, ఆ తర్వాత త్రివిక్రమ్‌ ఎన్టీఆర్‌ కాంబినేషన్‌లో కూడా ఈమె అంటున్నారు. బన్నీతో ఎలాగూ 'నా పేరు సూర్య', మారుతి-నాగచైతన్యల చిత్రంలో కూడా అనునే పెట్టుకోవడంతో ఈమెకే ఎక్కువ అవకాశాలున్నాయని చెప్పవచ్చు.

Anu Emmanuel bagged Samantha offers:

Producers Eye on Anu Emmanuel in Samantha Place
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs