Advertisement
Google Ads BL

బాలయ్య బాబు..102 వ టైటిల్ ఇదే!


బాలకృష్ణ 100  వ చిత్రం క్రిష్ దర్శకత్వంలో గౌతమీపుత్ర శాతకర్ణి వంటి చారిత్రాత్మక చిత్రంలో నటించిన బాలయ్య.... 101 వ చిత్రాన్ని పూరి దర్శకత్వంలో పైసా వసూల్ వంటి కమర్షియల్ చిత్రంలో నటించాడు. రెండు సినిమాలు కూడా జెట్ స్పీడు తో పూర్తి చేసి ఊపుమీదున్న బాలకృష్ణ ఇప్పుడు రవికుమార్ దర్శకత్వంలో 102  వ చిత్రాన్ని మొదలు పెట్టి శరవేగంగా షూటింగ్ కంప్లీట్ చేస్తున్నాడు బాలకృష్ణ . ఈ సినిమాలో నయనతార మెయిన్ హీరోయిన్ గా నటిస్తుండగా మరో ఇద్దరు హీరోయిన్స్ కూడా బాలయ్యకి జోడిగా నటిస్తున్నారు.

Advertisement
CJ Advs

కె.ఎస్.రవి కుమార్ - బాలకృష్ణ కలయికలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ముందుగా తమిళనాడులో షూటింగ్ జరుపుకుని.. ఆతర్వాత హైదరాబాద్ లోని రామోజీఫిల్మ్ సిటీకి షూటింగ్ షిఫ్ట్ చేసుకుంది. బాలకృష్ణ రెండు పాత్రల్లో కనబడనున్న ఈ చిత్రం దాదాపు ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్ లోనే తెరకెక్కుతుంది అని వినికిడి. అయితే ఈ సినిమా టైటిల్ ని ముందుగా జయసింహ అనిగాని లేకుంటే రెడ్డి గారు అనిగాని పెడుతున్నట్లుగా వార్తలు హల్చల్ చేశాయి. కానీ బాలయ్య - రవి కుమార్ సినిమాకి  కర్ణ అనే టైటిల్ ని రిజిస్టర్ చేయించినట్లుగా సమాచారం అందుతుంది.

కాకపోతే కర్ణ అనే టైటిల్ ని వేరొకరు రిజిస్టర్ చేయించుకున్న కారణంగా బాలకృష్ణ సినిమాకు NBK కర్ణ  అని పెట్టడానికే చిత్ర యూనిట్ తోపాటు బాలయ్య బాబు ఫిక్స్ అయినట్లుగా వార్తలోస్తున్నాయి. అయితే అప్పుడే టైటిల్ ని రివీల్ చెయ్యకుండా చిత్ర యూనిట్ సస్పెన్స్ మెయింటింగ్ చేస్తున్నట్లుగా కథనాలు వెలువడుతున్నాయి. మరి కర్ణగా బాలయ్య బాబు ఎలాంటి పవర్ ఫుల్ పాత్రలో ఇరగదీయనున్నాడో ఈ సంక్రాంతికే తేలిపోతుందేమో.... ఎందుకంటే బాలయ్య - రవి కుమార్ ల చిత్రం వచ్చే సంక్రాంతికే విడుదల చేస్తారనే టాక్ ఉంది.

Nandamuri Balakrishna 102nd KARNA!:

Tamil director KS Ravi Kumar under the production of C Kalyan. Like each one of us is informed about Jayasimha as the working title, here comes an update that makers are contemplating to lock KARNA as the final title.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs