Advertisement
Google Ads BL

నానినే కాదు.. ఒక్క తెలుగు హీరో కూడా లేడు!


మొన్నామధ్యన లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో హీరో నాని నటిస్తున్నాడంటూ వార్తలు హల్చల్ చేశాయి. మణిరత్నం తెరకెక్కించబోయే మల్టీస్టార్ సినిమాలో నాని కూడా ఉన్నాడని అన్నారు. మరోవైపు నాని.. మణిరత్నం సినిమాలో నటించడంలేదన్నారు. అయితే నాని, మణిరత్నం సినిమాలో నటిస్తున్నాడా? లేదా అనే విషయానికి ఇప్పుడు పూర్తి క్లారిటీ వచ్చింది. మణిరత్నం సినిమాలో నేచురల్ స్టార్ నాని నటించడంలేదు ఇది పక్కా... అనే విషయాన్నీ మణిరత్నమే స్వయంగా ప్రకటించాడు.

Advertisement
CJ Advs

తన నెక్స్ట్ ప్రాజెక్ట్ లో నానికి చోటు లేదంటున్నాడు ఈ డైరెక్టర్. తన అప్ కమింగ్ సినిమాకి సంబందించిన ప్రీ లుక్ తో పాటు ఆ సినిమాలో నటించే నటీనటుల వివరాలను కూడా ప్రకటించాడు. గతంలో మణి దర్శకత్వంలో వచ్చిన యువ టైపులో ఒక  యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ ప్లాన్ చేస్తున్న మణిరత్నం ఈ సినిమాని తెలుగు, తమిళ, హిందీ ప్రేక్షకులు మెప్పించే విధంగా తెరకెక్కిస్తున్నాడు. అందుకే ఆయా భాష నటులకు ఈ సినిమాలో చోటివ్వాలని ముందుగా అనుకున్నాడు ఈ దర్శకుడు. 

అయితే హిందీ నుండి, తెలుగు నుండి ఎటువంటి హీరో సెట్ కాలేదని తెలుస్తుంది. అందుకే తమిళ నటులతోనే ఈ ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేస్తున్నాడు మణి. ఇక తమిళం నుండి శింబు, విజయ్ సేతుపతి, అరవింద్ స్వామిని తీసుకున్న మణిరత్నం మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ ని కూడా ఈ సినిమా కోసం సెలక్ట్ చేశాడు. ఇక ఈ సినిమాకి సంగీతం ఏఆర్ రెహ్మాన్ అందిస్తుండగా.. సంతోష్ శివన్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు.

Mani Ratnam New Movie Without Tollywood Heroes!:

Maniratnam New Movie Production No 17 Pre Look Released.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs