Advertisement
Google Ads BL

తండ్రి కొరకు తనే హీరో.. తనే నిర్మాత..!


బాలకృష్ణ తన తండ్రి జీవితాన్ని సినిమా తియ్యాలని అనుకున్నదే తడువుగా.. అధికారికంగా ఎన్టీఆర్ బయోపిక్ గురించి ప్రకటించడం... ఆ వెనువెంటనే ఈ సినిమాని రామ్ గోపాల్ వర్మ అయితే బాగా తీస్తాడని బాలకృష్ణ కి పూరి సూచించడం జరిగాయి. ఇక వర్మ కూడా ఎన్టీఆర్ బయోపిక్ దర్శకుడు తానే అని ఫిక్స్ అవడము... బాలకృష్ణ ఏం మాట్లాడకపోయేసరికి మళ్లీ ఇప్పుడు లక్ష్మిస్ ఎన్టీఆర్ తీస్తానని బయలుదేరడం జరిగాయి కూడా. మరోపక్క బాలకృష్ణ మనసులో ఎన్టీఆర్ బయోపిక్ ని తెరకెక్కించే ఛాన్స్ దర్శకుడు తేజకి ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు గత నెల రోజులుగా వార్తలొస్తున్నాయి. ఎక్కడా ఎటువంటి క్లారిటీ లేకపోయినా... తేజ దర్శకత్వంలో బాలకృష్ణ తన తండ్రి బయోపిక్ ని తెరకెక్కిస్తున్నాడనే ప్రచారం మాములుగా లేదు.

Advertisement
CJ Advs

ఇకపోతే బాలకృష్ణ తన తండ్రి బయోపిక్ ని ఏ నిర్మాణ సంస్థతో పని చేస్తాడో అనేదాని మీద మాత్రం ఎటువంటి న్యూస్ లేదు. కానీ ఇప్పుడు తన తండ్రి బయోపిక్ ని వేరే నిర్మాణ సంస్థలో తీస్తే తగిన న్యాయం చేయలేనని భావించిన బాలయ్య తానే నిర్మతగా మారాలనుకుంటున్నాడట. దీనిబట్టి ఎన్టీఆర్ బయోపిక్ లో బాలకృష్ణే హీరో, నిర్మాత అన్నమాట. అయితే మరి నిర్మతగా మారాలంటే.... ఒక నిర్మణ సంస్థ కూడా ఉండాలిగా. అందుకే బాలకృష్ణ సొంత‌గా ఒక నిర్మాణ సంస్థ‌ను ప్రారంభించాల‌నే ఆలోచన చేస్తున్నట్టుగా వార్తలొస్తున్నాయి. ఇక బాలయ్య ఆ నిర్మాణ సంస్థకు త‌న ఇద్ద‌రు కూతుళ్లు బ్రాహ్మ‌ణి, తేజ‌స్విని పేర్ల మీద వచ్చేలా బ్రహ్మతేజ ప్రొడక్షన్స్ అనే నిర్మాణ సంస్థను నెలకొల్పేందుకు బాలకృష్ణ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.

ఇక ఆ నిర్మాణ సంస్థలో మొదటగా తన తండ్రి సినిమానే నిర్మించాలని బాలకృష్ణ అనుకుంటున్నాడట. అయితే బాలకృష్ణ మాత్రం తన తండ్రి బయోపిక్ త్వరలోనే ఉంటుంది అని... దానికి సంబందించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది అని చెబుతున్నాడు గాని... ఎక్కడా ఈ సినిమా డైరెక్టర్ తేజ అనిగాని.. ఈ సినిమా ని నిర్మించే నిర్మాత ఎవరు అనేది మాత్రం చెప్పకుండా సస్పెన్స్ మెయింటింగ్ చేస్తున్నాడు.

NTR's Biopic on Balakrishna's Own Banner!:

<span>Nandamuri Balakrishna to Produce NTR's Biopic.</span>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs