మేలెంచరా నాయనా అంటే వాడెవడో ఏదో అన్నాడని ఓ మోటు సామెతను పెద్దలు చెబుతారు. అది సరిగ్గా రాయ్‌లక్ష్మికి వర్తిస్తుంది. మొదటి చిత్రంతోనే దక్షిణాదిలో కాకుండా బాలీవుడ్‌లో బికినీ జెండా ఎగురవేసి సన్నిలియోన్లు, షెర్లిన్ చోప్రాలవంటి మహామహులకు చెక్ చెబుదామని భావించిన ఈ కన్నడభామకు అనుకోని అవాంతరం కోర్టు రూపంలో ఎదురైంది. శుక్రవారం విడుదల కావాల్సిన ఆమె బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ మూవీ 'జూలీ2' చిత్రం కాపీరైట్‌కి చెందిన పలు సాంకేతికకారణాల వల్ల నిరవధికంగా వాయిదా పడింది. మొదట ఈ చిత్రంలోని బోల్డ్ కంటెంట్‌ని చూసి అందరూ ఈ చిత్రానికి సెన్సార్ వద్దనే మొదటి అడ్డంకి ఖాయంగా భావించారు. కానీ సెన్సార్ వారి ఉదారస్వభావమా అని ఎలాంటి ఇబ్బందులు లేకుండా సినిమా సెన్సార్ అయి బయటికి వచ్చింది.
కానీ రాయ్‌లక్ష్మి ఒకటి తలిస్తే విధి ఇంకోటి తలిచింది. కాపీరైట్ చట్టానికి సంబంధించిన చట్టపరమైన ఆటంకాలతో ఈ చిత్రం విడుదల ఆగిపోవడంతో రాయ్‌లక్ష్మికి తీవ్ర నిరుత్సాహం ఎదురైందనే భావించాలి. అంతేకాదు.. ఇది శృంగార ప్రియులకు కూడా భారీ డిజప్పాయింట్‌మెంటే. మరోపక్క రాయ్‌లక్ష్మి తమకు పోటీ అని భావించిన సన్నిలియోన్ వంటి ఇతర సెక్సీబాంబ్‌లకు ఇది పెద్ద ఊరడింపుగా చెప్పడం మాత్రమే కాదు.. ఆమె వ్యతిరేకులు చేసిన పూజలు ఫలించాయనే సెటైర్లు వినిపిస్తున్నాయి.
మరోపక్క ఈ చిత్రం వాయిదా ఎన్ని రోజులో స్పష్టంగా మేకర్స్ కూడా చెప్పలేకపోతున్నారు. ఇప్పటికే ప్రమోషన్స్‌ని ఉదృతంగా చేస్తూ, మంచి ఊపులో ఉన్న సమయంలో ఇది ఆశనిపాతమే. ఎందుకంటే సినిమాలు ఒక్కసారి వాయిదా పడితే వాటికున్న క్రేజ్, ఇమేజ్, ఊపు, శృంగార ప్రియుల్లోని రసికత, ఉద్రేకం, ఉత్సాహం అన్ని వేడి తగ్గి చివరకు నీరుగారి పోయే ప్రమాదం ఉంటుంది....!