మహేష్ బాబు - మురుగదాస్ కలయికలో బైలింగువల్ గా తెరకెక్కిన స్పైడర్ చిత్రం ఈ దసరాకి విడుదలై థియేటర్స్ లో రన్ అవుతుంది. మహేష్ బాబు ఈ చిత్రం లో స్పై ఏజెంట్ గా నటించాడు. అయితే స్పైడర్ తెలుగులో విడుదలైన మొదటి షోకే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. క్రిటిక్స్ కూడా ఒవరాల్ గా స్పైడర్ ని ప్లాప్ గా తేల్చేశారు. అయితే తెలుగులో డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న స్పైడర్ తమిళంలో మాత్రం మిరిశ్రమ స్పందనని తెచ్చుకుంది. అక్కడ తమిళ క్రిటిక్స్ స్పైడర్ చిత్రాన్ని బాగానే మెచ్చుకున్నారు. ఇంకేంటి మురుగదాస్ స్పైడర్ చిత్రం తమిళులకు బాగా నచ్చినది ప్రచారం గట్టిగానే జరిగింది.
అయితే మురుగదాస్ తమిళ ప్రమోషన్స్ లో స్పైడర్ లో హీరో మహేష్ కాదని... పూర్తిగా కథే హీరో అని చెప్పి తమిళులకు మహేష్ మీద పెద్దగా హోప్స్ పెట్టుకోకుండా చేశాడు. అందుకే అక్కడ మహేష్ ని మాములుగా చూడబట్టే వారికీ ఆ సినిమా కాస్తో కూస్తో నచ్చింది. కానీ తెలుగులో మాత్రం మహేష్ ని సూపర్ స్టార్ లా చూడడం వలెనే సినిమా పోయిందనే టాక్ ఉంది. అయితే తమిళంలో స్పైడర్ తెలుగు కంటే తక్కువ బిజినెస్ చేసినప్పటికీ ఇప్పుడు అక్కడ వారు పెట్టిన పెట్టుబడిలో సగం నష్టపోయే ఛాన్స్ ఉందంటున్నాయి ట్రేడ్ వర్గాలు.
ఎందుకంటే ముందు స్పైడర్ కి అక్కడ మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ కలెక్షన్స్ మాత్రం డ్రాప్ అయ్యాయి అంటున్నారు. అక్కడ మొత్తం కలిపి 10 కోట్ల షేర్ వస్తుంది అని అంచనా వేస్తున్నారు. మరి అక్కడ తమిళ హక్కులను 18 కోట్లకు పైబడి తీసుకున్నారు గనక నిర్మాతలు కొంతలో కొంత నష్టాలు పాలుగాక తప్పదంటున్నారు. ఇక తెలుగులో ఎలాగూ నిర్మాతలకు లాభం వచ్చినా డిస్ట్రిబ్యూటర్ మాత్రం భారీగా నష్టపోయే ఛాన్స్ లు ఎక్కువగా వున్నాయనే విషయం స్పైడర్ విడుదలైన రెండో రోజే అర్ధమైపోయింది.