Advertisement
Google Ads BL

అనుష్క పెళ్లి దాని తర్వాతనే..!


అరుంధతి, రుద్రమదేవి, బాహుబలి చిత్రాలలో అనుష్క తన కెరీర్ లో నిలిచిపోయే పాత్రలు చేసి ప్రేక్షకులను మెప్పించింది. అయితే ఇప్పుడు బాహుబలి తర్వాత మరో లేడి ఓరియెంటెడ్ చిత్రం భాగమతిలో నటిస్తుంది. ఇక ఈ సినిమా వచ్చే సంక్రాంతికి విడుదల చేస్తారని వార్తలొస్తున్నప్పటికీ... చిత్ర బృందం నుండి క్లారిటీ మాత్రం లేదు. ఇకపోతే ప్రస్తుతానికి అనుష్క చేతిలో ఈ భాగమతి తప్ప మరే ఇతర ప్రాజెక్ట్ లేదు. ఆమెకున్న అధిక బరువు వలన పెద్ద ప్రాజెక్ట్ లలో అనుష్క కి అవకాశాలు వచ్చినట్టే వచ్చి చేజారిపోతున్నాయి. 

Advertisement
CJ Advs

గతంలో సైజు జీరో సినిమా కోసం అధిక బరువు పెరిగిన అనుష్క మళ్లీ స్లిమ్ కాలేక అవస్థలు పడుతుంది. ఆ బరువు వలెనే రెండు క్రేజీ ప్రాజెక్టులైన సాహో, సై రా నరసింహారెడ్డి చిత్రాలలో అవకాశాలు వచ్చినట్టే వచ్చి చేజారిపోయాయి. ఈ విషయంలో బాగా హార్ట్ అయిన అనుష్క తనకున్న బరువును తగ్గించుకోవడానికి... ఇప్పటికే జిమ్, యోగా వంటి పద్దతులతో కొన్ని కిలోలు తగ్గినప్పటికీ ఇప్పుడు... సహజ పద్ధతుల్లో బరువు తగ్గడం కోసం కేరళ వెళ్లి అక్కడ కేరళ ఆయుర్వేద పద్దతులతో బరువు తగ్గించుకునే ప్రయత్నాలు ప్రారంభించింది.

అలాగే ప్రస్తుతానికి పెళ్లి ఆలోచనలు లేవని... బాహుబలి, అరుంధతి వంటి సినిమాలతో తనకు వచ్చిన ఇమేజ్ కి తగ్గట్టే... ఇప్పుడు అలాంటి ఇమేజ్ కి తగ్గ స్టొరీలనే ఎంచుకోవాలని.....అందుకే ఇప్పుడు సినిమాల్లో నటించకుండా ఈ గ్యాప్ అని చెప్పింది. అయితే అటువంటి స్క్రిప్ట్ కోసమే ఎదురుచూస్తున్నానని....స్క్రిప్ట్ విషయంలో అసలు కాంప్రమైజ్ కాను అనిచెబుతుంది అనుష్క. సో... దీన్నిబట్టి ముందు కెరీర్ ఆతర్వాతే పెళ్లి అన్నమాట.

'Size Zero' Problems Still Haunt Anushka!:

She has put on weight for the film and since then, she is struggling to lose the weight which has also become a problem for Baahubali 2.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs