Advertisement
Google Ads BL

అన్నని మించిన తమ్ముడు..!


తెలుగులో బిగ్‌స్ర్కీన్‌పై రామ్‌చరణ్‌ దూకుడు అందరికీ తెలిసిందే. ఇక ఆయన మెగాస్టార్‌ కుమారుడు కావడం, ఆయనకు రెండో చిత్రంతోనే 'మగధీర' వంటి ఇండస్ట్రీ హిట్‌ రావడం ఆయన దూకుడుకు కారణాలుగా చెప్పవచ్చు. కానీ మెగాస్టార్‌ చిరంజీవితో పోలిస్తే ఏదో అన్నయ్య చిరుని, తమ్ముడు పవన్‌ని చూసి ఆయన సోదరుడుగా నాగబాబుకు విలువ, గౌరవం ఇస్తారేమో గానీ నాగబాబుకంటూ ఓన్‌ ఫ్యాన్స్‌ ఉండరు కాబట్టి రామ్‌చరణ్‌ కంటే వెండితెర మీద వరుణ్‌తేజ్‌ కాస్త వెనుకబడి ఉండవచ్చు. కానీ వరుణ్‌తేజ్‌ కూడా డిఫరెంట్‌ చిత్రాలతో తానేమిటో నిరూపించుకుంటూనే వస్తున్నాడు. ఆయన నటించిన 'ముకుందా, కంచె' ఫర్వాలేదనిపించగా, 'లోఫర్‌, మిస్టర్‌' మాత్రం ఆయన వైఫల్యమే. 

Advertisement
CJ Advs

ఇక రామ్‌చరణ్‌ విషయానికి వస్తే ఆయన మొదట్లో మాస్‌ చిత్రాలు చేసి ఇక అవి ఎంతో కాలం తనను నిలబెట్టలేవని గ్రహించి 'ధృవ' తో రీమేక్‌ అయినా సరే కొత్తదనం వైపు అడుగువేశాడు. పెద్దనోట్ల రద్దు సమయంలో వచ్చిన ఈ చిత్రం అనుకున్న స్థాయిలో ఆడకపోయినా అన్‌సీజన్‌లో వచ్చి కూడా మంచి రిజల్ట్‌నే సాధించింది. ఇక మెగాప్రిన్స్‌ వరుణ్‌తేజ్‌ కంటే మెగామేనల్లుడే దూసుకుపోతున్నాడు అనే టాక్‌ వస్తున్న సమయంలో వరుణ్‌తేజ్‌ 'ఫిదా' తో ఏకంగా 50కోట్ల క్లబ్‌లో చేరాడు. కానీ ఈ క్రెడిట్‌ సాయిపల్లవి, శేఖర్‌కమ్ముల, దిల్‌రాజుల ఖాతాలో పడింది. మరి రాబోయే వరుణ్‌తేజ్‌ చిత్రం ఆయనకు ఎంత వరకు ఉపయోగపడిందో అర్దమవుతుంది. ఇక ఒకే రోజున వరుణ్‌తేజ్‌ 'ఫిదా' చిత్రం, రామ్‌చరణ్‌ 'ధృవ' చిత్రాలు బుల్లితెరపై వచ్చాయి. 

కానీ తెలివిగా స్టార్‌ మా టీవీ 'ఫిదా' చిత్రాన్ని మధ్యాహ్నమే వేసింది. కానీ 'ధృవ' చిత్రం సాయంత్రం టెలికాస్ట్‌ అయింది. కానీ సాయంత్రం ఇండియా-ఆస్ట్రేలియా వన్డే క్రికెట్‌ మ్యాచ్‌తో పాటు 'బిగ్‌బాస్‌' ఫినాలే వంటివి ఉన్న కారణంగా 'ఫిదా' టీఆర్పీల దరిదాపుల్లోకి కూడా 'ధృవ' రాలేకపోయింది. వాస్తవానికి ఇదే రిజల్ట్‌ని అందరూ ఊహించారు. 'ఫిదా'కి ఏకంగా 21.4 టీఆర్పీ నమోదు కాగా, 'ధృవ'కు 12 మాత్రమే వచ్చింది. మధ్యలో దూరిన 'రారండోయ్‌ వేడుకచూద్దాం'కు 'ధృవ' కంటే ఎక్కువగా 16 రావడం గమనార్హం. దీన్ని బట్టి 'ధృవ' చిత్రం టీఆర్పీ తక్కువగా ఉండటానికి ఎవరు ఎన్నికారణాలు చెప్పినా, 'ఫిదా, రారండోయ్‌ వేడుకచూద్దాం' ల కంటే ఈ చిత్రానికి ఫ్యామిలీ ఆడియన్స్‌ పెద్దగా ఆసక్తి చూపలేదని చెప్పాలి.

Varun Tej dominates Ram Charan in TRP Ratings:

Fidaa dominates Dhruva in Television TRP ratings
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs