Advertisement
Google Ads BL

మరో శృతి, అక్షరలు రాబోతున్నారు...!


మిగతా ఇండస్ట్రీలలో ఏమో చెప్పలేం గానీ తెలుగులో వారసురాళ్లను పెద్దగా ఆమోదించరు. కానీ కోలీవుడ్‌లో పరిస్థితి కాస్త నయం. ఇప్పటికే కమల్‌హాసన్‌ ఇద్దరు కూతుర్లు తమిళం, తెలుగు, హిందీ భాషల్లో కూడా తమ బహుముఖ ప్రజ్ఞను చాటి నటన, సింగింగ్‌, మ్యూజిక్‌ డైరెక్షన్‌, స్వచ్చంద సంస్థలు, సమాజ సేవ, ఇలా అన్నింటిలో ప్రతిభ చూపి కనిపించినంత వేగంగానే తిరిగి దూరమవుతున్నారు. ఇప్పుడు తమిళ మరో సీనియర్‌ స్టార్‌ శరత్‌కుమార్‌ ఇద్దరు కూతుర్లు కూడా సినిమాలలోకి వస్తున్నారు. ఆల్‌రెడీ పెద్దమ్మాయి వరలక్ష్మి శరత్‌కుమార్‌ హీరోయిన్‌గా తమిళ నాట రాణిస్తోంది. 'పోడా పోడీ' చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచయమైన ఈ భామ బాల దర్శకత్వంలో వచ్చిన 'తారాతప్పట్టై' చిత్రంతో నటిగా మంచి పేరును తెచ్చుకుంది, నిన్నమొన్నటి దాకా తెలుగు కుర్రాడు, మాస్‌ హీరో, నడిగర్‌ సంఘం, నిర్మాతల సంఘం ఎన్నికల్లో తన తండ్రిని ఓడించి రియల్‌హీరో అనిపించుకున్న విశాల్‌తో ప్రేమాయణం నడిపింది. 

Advertisement
CJ Advs

తమ మధ్య ఎఫైర్‌ ఉందని, నడిఘర్‌ సంఘం కొత్త బిల్డింగ్‌ పూర్తయితే అక్కడ జరిగే మొదటి పెళ్లి తమదేనని విశాల్‌ ప్రకటించాడు. కానీ ప్రస్తుతం ఎందుకనో విశాల్‌-వరలక్షిల మీద ఇప్పుడు పెద్దగా వార్తలు రావట్లేదు. బహుశా బ్రేకప్‌ అయిపోయి ఉంటుందేమో...! ఇక ఈ వరలక్ష్మి ప్రస్తుతం 'శక్తి' అనే లేడీ ఓరియంటెడ్‌ చిత్రంలో నటిస్తోంది. లేడీ పోలీస్‌ ఆఫీసర్‌కి, ఓ విలన్‌కి మద్య జరిగే యాక్షన్‌ థ్రిల్లర్‌ ఈ చిత్రం. ఇక ఈ చిత్రం ద్వారా శరత్‌కుమార్‌ మరోకుమార్తె , వరలక్ష్మి చెల్లెలు పూజ కాస్ట్యూమ్స్‌ డిజైనర్‌గా అవతారం ఎత్తుతోంది. 

ఈ ఏడాది మార్చితో ఈ చిత్రం విడుదల కానుంది. బహుశా సినిమా రంగంలోని అన్నిశాఖల్లో కాస్త ఈజీగా పేరు వేసుకోదలుచుకుంటే అది కాస్ట్యూమ్స్‌ డిజైనర్‌ అయి ఉంటుంది. ఎందుకంటే ఏ పని పాటా లేక ఇంట్లో ఉన్న వారసురాళ్లు, డైరెక్టర్ల భార్యలు చివరకు రజనీ, కమల్‌ కూతుర్ల నుంచి చిరంజీవి,రాజమౌళి, శ్రీనువైట్ల భార్య, కూతురు వరకు అందరు ఎవరిని అడిగినా కాస్ట్యూమ్స్‌ డిజైనర్‌గా పనిచేశామని చెబుతున్నారు. ఇక ఇదే 'శక్తి' పేరుతో ఎన్టీఆర్‌ అప్పుడెప్పుడో తెలుగులో వచ్చి మర్చిపోలేని సినిమాను అందించాడు. మరి ఈ 'శక్తి' సంగతేంటో చూడాలి....! 

Hero Sarath Kumar Daughter Enters Tollywood:

Actor Sarath Kumar Daughter Tollywood Entry soon
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs