Advertisement
Google Ads BL

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి చిన్మయి వార్నింగ్..!


ఇటీవల పవన్‌కళ్యాణ్‌ మాజీ భార్య రేణుదేశాయ్‌ రెండో వివాహం సమస్య మూడో ప్రపంచ యుద్ద స్థాయిలో చర్చను రేపుతోంది. మగాళ్లు ఎన్ని పెళ్లిళ్లు చేసుకున్నా ఫర్వాలేదు.. ఆడాళ్లు రెండో వివాహం గురించి కనీసం ఆలోచించడం కూడా తప్పేనా? అని అదే పనిగా పవన్‌ ఫ్యాన్స్‌ పేరుతో తనను టార్గెట్‌ చేస్తున్న వారికి రేణుదేశాయ్‌ బాగా లెక్చర్‌ పీకింది. చివరకు పవన్‌ ఫ్యాన్స్‌ నుంచి చికాకు తట్టుకోలేక సమాజపరంగా తాను చెప్పిన దానిని చూడమని అపాలజీ చెప్పే స్థాయికి కూడా వచ్చింది. అక్కడే చిన్మయి తన అతి తెలివి చూపింది. 

Advertisement
CJ Advs

ఇంతకు ఈ చిన్మయి ఎవరంటే ప్రముఖ సింగర్‌ కమ్‌ డబ్బింగ్‌ ఆర్టిస్టు. ఆమె రేణూదేశాయ్‌ నిజాయితీతో చేస్తున్న వాదనను తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తూ 'రేణూదేశాయ్‌ చెప్పిన విషయాన్ని అర్ధం చేసుకోండి.. అంతేగానీ ఏదో కామెంట్స్‌ చేసేయడం కాదని చెబుతూనే తనపై సుచీ లీక్స్‌ సమయంలో వచ్చిన విమర్శలను ఈ విషయంలోకి లాగి నెటిజన్లు నన్ను కూడా ఒకసారి ఇలాగే ఇబ్బందిపెట్టారు అని మెలిక పెట్టింది'. ఇక్కడ పవన్‌, రేణుదేశాయ్‌ సమస్య నిజంగా చర్చకు అవకాశం ఉన్న సమస్యే. ఒక విధంగా చూసుకుంటే ఇది పవన్‌కి, ఆయన మాజీ భార్యకి, ఆయన్ను అభిమానించే వారి మద్య జరుగుతున్న కుటుంబసమస్య వంటిది. 

కానీ చిన్మయి వ్యవహారం అది కాదు. నాడు ఆమె చేసిన దానిని కేవలం అభిమానులే కాదు నెటిజన్లందరూ దుయ్యబట్టారు. ఇక పవన్‌ ఫ్యాన్స్‌కి, చిన్మయికి వివాదం పెద్దది కాకుండా ఆమె భర్త రాహుల్‌రవీంద్రన్‌ సీన్‌లోకి వచ్చి ఆమెకి పవన్‌ అంటే ఎంతో గౌరవం.. ఆమె మాటలను తప్పుగా తీసుకోవద్దు అని నచ్చజెప్పాడు. చిన్మయి ఏమో నాది తప్పుంటే సరి చేసుకుంటాను. కానీ ఇష్టం వచ్చినట్లు కామెంట్స్‌ చేస్తే ఇక నేను చేసేది ఏమీ ఉండదు..అంటూ మరోసారి అసహనం వ్యక్తం చేసింది. 

Pawan Kalyan fans Angry On Singer Chinmayi Sripada:

Chinmayi Sripada feels with Pawan Kalyan fans comments
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs