చైతన్య - సమంతల వివాహం శుక్రవారం రాత్రి గోవాలోని డబ్ల్యు రిసార్ట్ లో ఇరు కుటుంబాల మధ్యన అంగరంగ వైభవంగా జరిగింది. పెళ్ళికి ముందు అంటే శుక్రవారం ఉదయం నుండే పెళ్లివేడుకలు ఆకాశాన్నంటాయి. మెహిందీ వేడుక, సంగీత వేడుకలో బీభత్సంగా ఎంజాయ్ చేసిన ఈ జంటతో పాటు అక్కినేని, దగ్గుబాటి, సమంత ఫ్యామిలీ చాలా హుషారుగా పార్టిసిపేట్ చేశాయి. రాత్రి డిన్నర్ అయిన తర్వాత శుక్రవారం రాత్రి 11 గంటల 30 నిమిషాలకు హిందూ సంప్రదాయంతో ఒక్కటైన చైతూ - సామ్ ల జంట, శనివారం క్రిస్టియన్ సంప్రదాయంలో మరోసారి పెళ్లి చేసుకోబోతున్నారు. అందమైన అదిరిపోయే కల్యాణ మండపంలో నాగ చైతన్య... సమంత నెత్తిమీద జీలకర్ర బెల్లం పెట్టి మరీ మూడు ముళ్ళు వేసి సమంతని తన భార్యని చేసుకున్నాడు. ఇక సమంత కూడా చైతూకి నెత్తిమీద జీలకర్ర బెల్లం పెట్టి.... పూల దండ వేసి మరీ చైతూని తన వాణ్ణి చేసుకుంది. చాలా సింపుల్ గా జరిగిన ఈ పెళ్ళికి కేవలం ఇరు కుటుంబాల వారు మాత్రమే హాజరవడం.... సినిమా ఇండస్ట్రీలోని నటీనటులెవరికి ఈ పెళ్ళికి ఆహ్వానం అందలేదు.
అయితే చైతు - సామ్ పెళ్ళికి ఆహ్వానం అందకపోతేనేమి అందరూ సోషల్ మీడియా సాక్షిగా ఈ అందమైన జంటకి పెళ్లి శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్స్ చేస్తున్నారు. సమంత ఈగ చిత్రంలో నటించిన హీరో నాని అయితే వెరైటీగా చైతు - సామ్ లు కలిసి నటించిన ఫస్ట్ సినిమా పేర్లను అంటే ఏమాయ చేశావేలో నాగ చైతన్య పేరు, సమంత పేర్లు అయిన కార్తీక్, జెస్సిలు అని సంబోధిస్తూ కార్తీక్ - జెస్సిలకు ఈ పెళ్లితో ప్రేమకు శుభం కార్డు పడిపోయింది అని సరదాగా విషెస్ తెలిపాడు. ఇక దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు అయితే నాగ చైతన్య - సమంత ల జంటను 'శతమానం భవతి' అని ప్రేమతో దీవెనలను అందించారు.
ఇక సమంత చేనేత వస్త్రాలకి తెలంగాణ తరుపున బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నందున తెలంగాణ ఐటి శాఖ మంత్రి కేటీఆర్ కూడా... మా హ్యాండ్లూమ్ బ్రాండ్ అంబాసిడర్.. నాకు తెలిసిన వారిలోనే నైసెస్ట్ పర్సన్ అయిన సమంతకు.. చై అక్కినేనికి శుభాకాంక్షలు అంటూ విషెస్ తెలిపారు. ఇంకొంత మంది ప్రముఖులు కూడా సమంత - నాగ్ చైతన్య జంటని మనస్ఫూర్తిగా దీవించారు.