చిత్రాలను తీయడంలో దర్శకుడు పూరీ జగన్నాథ్‌ది డిఫరెంట్ స్కూల్. మిగిలిన టాప్‌డైరెక్టర్లు రెండు మూడు సీన్స్‌లో చూపించే హీరోయిజాన్ని పూరీ ఒకే ఒక్క డైలాగ్‌లో చెప్పించేస్తాడు. ఇక ఆయన అనుకున్న సమయం కంటే ముందరగా తీయడంలో కూడా నేర్పరి. ఫలితం ఎలా ఉన్నా సెప్టెంబర్ 29న దసరాకు రావాలనుకున్న 'పైసా వసూల్' వంటి భారీ స్టార్ చిత్రాన్ని దాదాపు నెలముందుగా విడుదల చేశాడు. కానీ ఆయనకు వరుసగా 'జ్యోతిలక్ష్మి, లోఫర్, ఇజం, రోగ్, పైసావసూల్'లతో దిమ్మతిరిగే షాక్‌లు వచ్చాయి. అయినా కూడా పూరీ, బాలయ్య 103వ చిత్రానికి తానే దర్శకుడిని అని చెబితే, బాలయ్య కూడా తన 103వ చిత్రం పూరీతోనే అనేశాడు.
ఇక ప్రస్తుతం పూరీ చేతిలో సినిమాలు లేవు. నిర్మాతలు కూడా లేరు. దాంతో తన వైష్ణో అకాడమీని వదిలేసి పూరీ కనెక్ట్స్ మీద చార్మి భాగస్వామ్యంలో తన కుమారుడు ఆకాష్‌పూరీని పూర్తి స్థాయి హీరోగా ఎస్టాబ్లిష్ చేస్తూ 1971 నాటి ఇండోపాక్ వారు నేపద్యంలో రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ఓ చిత్రాన్ని ప్లాన్ చేశాడు. 'మెహబూబా' అనే టైటిల్‌ని కూడా అనౌన్స్ చేశాడు. పేరుకు చార్మి భాగస్వామి కానీ పెట్టుబడి మొత్తం పూరీదేనని టాక్.
ఇక పూరీ, మహేష్‌తో ఓ చిత్రం చేస్తానన్నాడు కానీ అది వర్కౌట్ అయ్యే అవకాశాలు లేవు. ఇక తాజాగా పూర్తి స్థాయి వినోదాత్మక కథను ఒకటి పూరీ తయారు చేశాడట. దీనిని పూర్తిస్థాయిలో కమెడియన్ టర్న్‌డ్ హీరో సునీల్ హీరోగా తీయడానికి, దీనిని కూడా తన పూరీ కనెక్ట్స్‌పైనే తెరకెక్కించాలని పూరీ భావిస్తున్నాడు. ఈ మధ్య సునీల్, పూరీ ఇద్దరు ఫ్లాప్‌లలోనే ఉన్నారు. ఇద్దరికీ ఈ చిత్రం విజయం అత్యవసరం. మరి కష్టాల్లో వున్న వీరిద్దరికి ఈ చిత్రం హిట్టిచ్చేదేమైనా ఉందా..? లేదా అనేది వేచిచూడాల్సివుంది...!