వెంకటేష్ తన తండ్రి డి.రామానాయుడు మరణం తర్వాత చాలా కామ్‌గా ఉంటున్నాడు. స్వతహాగా మితభాషి, ఆధ్యాత్మికత ఉన్నవాడు కావడం కూడా దీనికి మరోకారణం. ఇక ఆయన తండ్రి మరణం తర్వాత వెంకీ, ఆయన సోదరుడు సురేష్‌బాబులు పెద్దగా సఖ్యతగా లేరని, దాంతో ఆ బేనర్‌లో చిత్రాలు చేసే విషయంలో కూడా వెంకీ తన సోదరుడి వైఖరితో డిజప్పాయింట్ అయి ఉన్నాడని వార్తలు వస్తున్నాయి. ఇక ఆయనకు 'విక్రమ్ వేద' చిత్రంలో రీమేక్‌గా నటించమని ఆఫర్ వచ్చింది. ఇందులో ఆయనతో పాటు రానా దగ్గుబాటికి అవకాశం వచ్చిందని, ఆ చిత్రం నిర్మాత శశికాంత్ కూడా మాధవన్, విజయ్‌సేతుపతి పాత్రలకు వెంకీ, రానా సరిజోడు అనుకున్నా వెంకీ నో అనడం ఆశ్చర్యం.
ఈ కథ కూడా ఎంతో మంచి స్టోరీ. ఇక రీమేక్‌లంటే వెంకీకి ఎలాగూ ఇంట్రస్టే. ఇక పూరీ జగన్నాథ్, కిషోర్ తిరుమల, తేజ వారితో చిత్రాలు ఉంటాయన్నారు. కానీ దానిపై ఎలాంటి సమాచారం లేదు. ఇక వెంకటేష్ విషయానికి వస్తే ఆయన తెలుగు కంటే ఇంగ్లీషు బాగామాట్లాడుతాడు. తెలుగులో మాట్లాడటానికి తడబడి ఇంగ్లీషులో మాట్లాడుతాడు. దానికి కారణం ఆయన చదువు ఇంగ్లీషు మీడియంలో కావడమే. తాజా సమాచారం ప్రకారం వెంకీ మరో రీమేక్ చిత్రానికి ఓకే చెప్పాడని సమాచారం. బాలీవుడ్‌లో వచ్చిన 'హిందీ మీడియం' కు రీమేక్ ఇది. బహుశా టైటిల్ కూడా 'తెలుగు మీడియం' ఉండవచ్చు. ఈ చిత్రంలో ఇర్ఫాన్, ఆయన భార్య పాత్రధారి సబాక్వామర్ హిందీ మీడియంలో చదువుకుంటారు. వారి కూతుర్ని ఇంగ్లీషు మీడియంలో చేర్చించాలనేది వారి కల. కానీ హిందీ మీడియం చదువుకున్న భార్యాభర్తల పిల్లలను చేర్చుకోవడానికి ఇంగ్లీషు మీడియం యాజమాన్యాలు ఒప్పుకోవు. మరి ఈ దంపతులు తమ కల నెరవేర్చుకోవడానికి ఎన్ని కష్టాలు పడ్డారు అనేది హార్ట్‌టచ్చింగ్‌గా చెప్పిన చిత్రం ఇది.
ఈ చిత్రాన్ని దర్శకురాలు నందిని రెడ్డి తెరకెక్కించనుందని, ఇందులో వెంకటేష్ నటిస్తాడని సమాచారం. ఇలాంటి పాత్రలు, సినిమాలలో వెంకీ అతికినట్లు సరిపోతారు. ముఖ్యంగా మధ్యతరగతి పాత్రలకు ఆయనను మించిన వారు లేరనే చెప్పాలి. ఈచిత్రం నందినిరెడ్ది దర్శకత్వంలో నటిస్తే వెంకీకి ఓ ఘనత లభిస్తుంది. ఇప్పటికే ఆయన రీమేక్‌లుగా శ్రీప్రియ దర్శకత్వంలో 'దృశ్యం', సుధాకొంగర దర్శకత్వంలో 'గురు' చేశాడు. ఇప్పుడు దీని రీమేక్‌ని నందినిరెడ్డితో చేస్తే ఆయన ముగ్గురు నటీమణులు అంటే దర్శకురాళ్ల దర్శకత్వంలో నటించిన ఘనతను చేజిక్కించుకుంటాడు. హిందీలో 12 కోట్లతో తెరకెక్కిన ఈచిత్రం 100కోట్లకు పైగానే వసూలు చేసింది.