ఇండియన్ సిల్వర్‌స్క్రీన్ మీద దర్శకుడు శంకర్ అంటే ప్రత్యేకంగా లిఖించాల్సిన పేరేనని చెప్పాలి. ఆయన నిర్మాతల చేత ఎక్కువగా ఖర్చుచేయిస్తాడనే అపవాదు ఉంది కానీ ఆయన మాత్రం ఖర్చు చేసే ప్రతి పైసా తెరపై కనిపించేలా చేయడంలో సిద్దహస్తుడు. చిత్రాన్ని తనదైన రీతిలో ఓ కళాఖండంగా, ఎవ్వరూ, మరెవ్వరూ తీయలేరు అన్న తరహాలో నభూతో నభవిష్యతిలా తన ప్రతి ఫ్రేమ్‌ని, షాట్‌ని ఎంతో ప్రేమించి తీస్తాడు. ఆయన చిత్రాలలో గ్రాఫిక్స్, విజువల్ వండర్స్, భారీ సెట్టింగ్‌లు, భారీ యాక్షన్ సీన్స్‌తో పాటు ఆయన తీసే పాటలు కూడా ఎంతో ఆడంబరంగా, కోట్లకు కోట్లు ఖర్చుపెట్టి ఓ పాట కోసం కోట్లలో ఖర్చుచేసి, అత్యద్భుత లోకేషన్లలలో, సెట్స్‌లో పాటలు తీస్తాడు.
ప్రపంచంలోని ఏడు వింతలే కాదు... ఓ లోకేషన్ కోసం ఎక్కడికైనా వెనుకాడకుండా వెళ్లి, ఎంత ప్రమాదరకమైన షాట్‌నైనా తీసి చూపించే దిగ్గజుడు శంకర్. ఆయన సినిమాలే కాదు... ఆయన దర్శకత్వంంలో వచ్చిన చిత్రాలలోని పాటలు, లోకేషన్లు, సెట్స్, చివరకు కాస్ట్యూమ్స్‌ని చూసి స్వయంగా నటీనటులే అచ్చెరువొందుతుంటారు. మరి అలాంటిది తెరపై చూసే ప్రేక్షకులు మరెంత థ్రిల్‌గా ఫీలవుతారనేది ఊహించలేం. ఇక ఆయన రెహ్మాన్ నుంచి ఎంచుకునే ట్యూన్స్ కూడా కలకాలం గుర్తుండిపోయి, పాట వినగానే ఇది రెహ్మాన్ ట్యూన్ కదా.. అనడంతోపాటు ఆయన చిత్రీకరించిన దృశ్యాలు కళ్ల ముందు నిలుస్తాయి. ఓ పాటను చూస్తేనే అది శంకర్ తీశాడా? లేదా? అని చెప్పేయగల బ్రాండ్‌నేమ్ ఆయనది. ఇలాంటి చిత్ర విచిత్రమైన ఎన్నో ఆయన తెరకెక్కిస్తున్న '2.0'లో ఉంటాయట.
మాములు చిత్రాలనే అద్భుతంగా తీసే ఆయన 'ఐ' మీద కసితో, ఇండియన్ ఇండస్ట్రీలోనే అత్యధిక బడ్జెట్‌తో రూపొందిస్తున్న ఈచిత్రంలో హీరో రజనీకాంత్‌కి, హీరోయిన్ అమీజాక్సన్‌కి, విలన్ అక్షయ్‌కుమార్‌ల గెటప్ నుంచి కాస్ట్యూమ్స్ వరకు అదిరిపోతాయట. ఈ చిత్రం షూటింగ్ పూర్త అయి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. మరో పాట చిత్రీకరణ మిగిలి ఉంది. ఈ చిత్రం కాస్ట్యూమ్స్‌ని చూడటానికి ముంబై నుంచి చెన్నై వచ్చిన అమీజాక్సన్ ఈ డ్రస్‌ని చూసి వావ్.. అంటూ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయిందట. ఇక రజనీ కూడా సేమ్ టు సేమ్. వీరు ఆ కాస్ట్యూమ్స్‌ని షూటింగ్ పూర్తయిన తర్వాత తమకు సొంతానికి ఇచ్చేయమని శంకర్‌ని అడిగినా ఆశ్యర్యపడాల్సిన పనిలేదు. మరి ఇవ్వన్నీ చూడాలంటే జనవరి 25 వరకు వెయిట్ చేయాలి...!