జై లవ కుశ కలెక్షన్స్ తో ఫుల్ ఖుషీగా వున్న తారక్ ప్రస్తుతానికి ఫ్యామిలీతో కలిసి విదేశాలకు ఎగిరిపోయాడు. జై లవ కుశ మిశ్రమ స్పందన రాబట్టినప్పటికీ కలెక్షన్స్ పరంగా మాత్రం పర్వాలేదనిపించింది. మొదటి వారం, రెండో వారంలో కూడా కలెక్షన్స్ స్టడీగా ఉండడం... మూడో వారం కూడా పెద్ద సినిమాలేమి లేకపోవడం వంటివాటితో జై లవ కుశ బ్రేక్ ఈవెన్ రావొచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక జై లవ కుశ తో ఎంజాయ్ చేస్తున్న ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమా కోసం వెయిటింగ్ లో ఉన్నాడు. మరి త్రివిక్రమ్ తో ఎన్టీఆర్ సినిమా వచ్చే మార్చిలోగాని పట్టాలెక్కే ఛాన్స్ కనబడడంలేదు.
ఇక ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కలయికలో తెరకెక్కనున్న ఈ సినిమాలో తారక్ ఒక మిలటరీ ఆఫీసర్ పాత్ర చేస్తున్నాడని మొన్నామధ్య ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు మాత్రం జై లవ కుశ చూసిన త్రివిక్రమ్, ఎన్టీఆర్ తో తాను తియ్యబోయే సినిమా గురించిన అభిప్రాయానికి పూర్తిగా మర్చేసుకున్నాడట. జై లవ కుశ లోని ఎన్టీఆర్ చేసిన కామెడీకి ముగ్దుడైన త్రివిక్రమ్ ఇప్పుడు తన సినిమాలో ఫుల్ ఫన్ కేరెక్టర్ లో ఎన్టీఆర్ ని చూపించాలనే ప్రయత్నాలు మొదలుబెట్టాడట. జై లవ కుశ లో కుశ పాత్ర కామెడీతో నవ్విస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసింది.
అందుకే త్రివిక్రమ్ తన సినిమాలో ఎన్టీఆర్ పాత్రని పూర్తిగా కామెడీ యాంగిల్ లోనే చూపించాలని ఫిక్స్ అవడం.... అదే విషయం ఎన్టీఆర్ తో చర్చించడం.. దానికి ఎన్టీఆర్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయినట్లుగా సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. మరి త్రివిక్రమ్ డైలాగ్స్ లో ఎక్కువగానే కామెడీ పంచ్ లు పేలుతుంటాయి. ఇప్పుడు త్రివిక్రమ్ డెసిషన్ తో ఎన్టీఆర్ ని పూర్తి స్థాయి కామెడీ పాత్రలో చూస్తామంటున్నారు. చూద్దాం ఇదెంతవరకు నిజమవుతుందో.!