దర్శకుడు హరీష్‌శంకర్‌లో అన్ని ఉన్నాయి. దర్శకునిలోని అన్ని క్వాలిటీస్ ఉన్నా కూడా ఆయన తాను మాట్లాడే మాటలు, తాను బిహేవ్ చేసే తీరు మాత్రం బాగుండదు. ఇక విషయానికి వస్తే ఆయన 'డిజె' చిత్రం రిలీజ్ తర్వాత చేసిన ప్రమోషన్‌లో కావాలనే మీడియాను ముందుపెట్టి ఆయన 'డిజె' చిత్రం బాగాలేదని కామెంట్స్ పెడుతున్నవారిని, వారి నెగటివ్ కామెంట్స్‌ని చూసి రెచ్చిపోయాడు. ఇన్‌డైరెక్ట్‌గా ఇదంగా పవన్ ఫ్యాన్స్ చేస్తున్నారంటూ ఇన్‌డైరెక్ట్‌గా విషయాన్ని కూడా కుండ బద్దలు కొట్టాడు. ఇక ఆయన కెరీర్‌లోనే కాదు.. పవన్ కెరీర్‌ను కూడా మనం 'గబ్బర్‌సింగ్'కి ముందు.. తర్వాత అని విడమర్చి చెప్పుకోవచ్చు. ఇది 'దబాంగ్' రీమేకే అయినా ఆ కాన్సెప్ట్‌ని మాత్రమే తీసుకుని, పవన్ స్టైల్‌ని, మేకోవర్‌ని, ఆయన బాడీలాంగ్వేజ్, డైలాగ్ డెలివరి వరకు డిఫరెంట్‌గా హరీష్‌శంకర్ చూపించాడు.
ఇక ఆయన 'డిజె' తర్వాత కాన్సెప్ట్ ఓరియంటెడ్ చిత్రం చేస్తానని ఆమధ్య అమెరికా వెళ్లి మరీ తన ఫొటోలను సోషల్‌మీడియాలో పోస్ట్ చేశాడు. ఇక పవన్‌కి 'గబ్బర్‌సింగ్' అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన దానికి తగ్గట్లుగా 'సర్దార్ గబ్బర్‌సింగ్' కూడా తీశాడు. అది ఫ్లాప్ అయింది. ఆ చిత్రంలో కూడా చివరన 'రాజా సర్దార్ గబ్బర్‌సింగ్' అని పేరు పెట్టి ప్రమోషన్‌లో మూడో పార్ట్ చేస్తారా? అని అడిగితే చేస్తానని చెప్పాడు. హిట్ వచ్చినా ఫ్లాప్ వచ్చినా పవన్ నిర్ణయం మారదు కాబట్టి ఆయన ప్రస్తుతం చేస్తున్న త్రివిక్రమ్ చిత్రం తర్వాత రాజా సర్దార్‌గబ్బర్‌సింగ్ చేయవచ్చునని విశ్వసనీయ సమాచారం.
దీని కోసం హరీష్‌శంకర్ ఓ స్టోరినీ కూడా రెడీ చేశాడట. పవన్ ఆయనకు ఇంకా అపాయింట్‌మెంట్ ఇవ్వలేదు. పవన్ వింటే మాత్రం ఈ స్టోరికి ఓకే చెప్పడం పక్కా అంటున్నారు. కాగా ఈచిత్రాన్ని ఇప్పటికే 'శ్రీమంతుడు, జనతాగ్యారేజ్' నిర్మించిన అలాగే 'రంగస్థలం 1985, సవ్యసాచి' వంటి చిత్రాలను నిర్మిస్తున్న మైత్రిమూవీమేకర్స్ నిర్మించబోతోంది. గతంలో తమ వద్ద పవన్ డేట్స్ ఉన్నాయని మైత్రి సంస్థ కూడా ప్రకటించింది. సో.. పవన్-హరీష్-మైత్రి కాంబినేషన్‌లో చిత్రం రూపొందే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అయితే హరీష్‌శంకర్‌ని పవన్ అభిమానులు ఒప్పుకుంటారా? అభిమానుల మాటకు విలువనిచ్చే పవన్ ఈచిత్రం చేస్తాడా? అనేవి ఎదురుచూడాల్సివుంది...!