Advertisement
Google Ads BL

ఎఫైర్ ఉంటే రుజువు చూపించమంటోన్నహీరో!


గత ఏడాది నుండి బాలీవుడ్ నటుడు హ్రితిక్ రోషన్ కి హీరోయిన్ కంగనాకి మధ్యన మాటల యుద్ధం జరుగుతున్న తీరు అందరికి తెలిసిందే. కంగనా, హ్రితిక్ మీదున్న కోపంతో సిల్లీ ఎక్స్ అనే మాటతో హ్రితిక్ రోషన్ ఈగో ని హార్ట్ చేసింది. అప్పట్లోనే ఈ విషయంపై పెద్ద రచ్చ కూడా జరిగింది. కంగనా అలా సిల్లీ ఎక్స్ అనగానే కోపంతో హ్రితిక్ రోషన్ కూడా కంగనా మీద ప్రతీకారంతో తనతో ఆమె సాగించిన సంభాషణల ఈ మెయిల్స్ అన్ని బయటపెట్టాడు. అక్కడితో ఆగకుండా ఇరువురు ఒకరిమీద ఒకరు పోలీస్ కంప్లైంట్స్ కూడా ఇచ్చుకునే స్టేజ్ కి వెళ్లారు.

Advertisement
CJ Advs

అలాగే మధ్య మధ్యలో కంగనా, హ్రితిక్ రోషన్ మీద కత్తులు దువ్వుతూనే వుంది. అప్పటినుండి ఇప్పటివరకు వారి మధ్యన కోల్డ్ వార్ తో పాటే మాటల యుద్ధం కొనసాగుతూనే వుంది. అయితే ఇప్పుడు తాజాగా హ్రితిక్ రోషన్.... కంగనాతో తనకున్న విభేదాలపై స్పందించాడు. తనపై ఆరోపణలు చేస్తున్న మహిళతో తనకెలాంటి సంబంధం లేదని... అసలు ఆమెను తానెప్పుడూ పర్సనల్ గా కలవలేదని...  ఇద్దరు హై ప్రొఫైల్ సెలబ్రిటీలు అయి ఉండి ఎలాంటి ఆధారం లేకుండా ఇన్నేళ్ల పాటు ఎలా ఎఫైర్ సాగిస్తారని ప్రశ్నలు సందిస్తున్నాడు. అసలు ఆమె మధ్యన నా మధ్య రొమాంటిక్ రిలేషన్‌షిప్ ఉందనడానికి ఎలాంటి రుజువులు లేవు. అంతేకాకుండా అసలు మేమిద్దరం సన్నిహితంగా ఉన్న ఫొటోలే లేవు అని అంటున్నాడు.

హ్రితిక్ రోషన్ ఇంకా.. 2014 జనవరిలో ప్యారిస్ లో మా ఇద్దరికీ ఎంగేజ్ మెంట్ జరిగిందన్న ప్రచారానికి ఎలాంటి ఆధారాలు లేవు.  అసలు అప్పుడు  నేను ప్యారిస్ కే వెళ్ళలేదు.... కావాలంటే నా పాస్ పోర్టు చెక్ చేసుకోండి అంటూ హ్రితిక్ చెబుతున్నాడు. అలాగే ఎంగేజ్మెంట్ జరిగితే ఫొటోస్ లేకపోయినా కనీసం సెల్ఫీ అన్న ఉండాలిగా అంటూ తనతో ఎఫైర్ ఉందని ప్రచారం జరుగుతున్న కంగనా పేరు చెప్పకుండా ఆమె అని సంబోధిస్తూ కంగనాతో తనకి ఎలాంటి ఎఫ్ఫైర్ లేదని క్లారిటీ ఇచ్చాడు.

Hrithik Roshan Reaction On Kangana Controversy:

Hrithik Roshan finally gets back at Kangana Ranaut
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs