Advertisement
Google Ads BL

సమంతని ఫ్యాన్స్ ఏం అడిగారో తెలుసా..?


వసపోసిన పిట్ట ఎవరంటే ఎవ్వరైనా ఠక్కున సమంత పేరు చెబుతారు. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండటం, నచ్చింది మొహాన అంటే '1' (నేనొక్కడినే) పోస్టర్‌ తరహాలో చెప్పేయడం, అల్లరి చిల్లరి పనులు చేయడంలో ఈ గడసరి మహాగడుసు పిల్ల. వాస్తవానికి మాటలు రాసే రచయిత, దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ని మాటల మాంత్రికుడిగా పిలుస్తారు. అదే సమంతను పిలవాల్సివస్తే 'మాటల మాంత్రికురాలు' అనాల్సిందే. 

Advertisement
CJ Advs

ఇక తాజాగా పెళ్లికి ముందు కూడా ఈమె అభిమానులతో ట్విట్టర్‌ వేడికగా పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. 'పెళ్లైన తర్వాత నాగ చైతన్య నిన్నేమైనా ఇబ్బంది పెడితే మాకు చెప్పు సమంత.. మన సామ్ ఆర్మీ వచ్చేస్తుంది' అని ఓ అభిమాని అన్నాడు. దానికి సమంత 'సో క్యూట్‌' అంటూ సమాధానం ఇచ్చింది. ఓ అభిమాని పెన్సిల్‌తో గీసిన నాగ చైతన్య, సమంతల పెయింటింగ్‌ను ఆమెకు పోస్ట్‌ చేస్తే 'వావ్‌ థాంక్యూ' అని రిప్లై ఇచ్చింది. 'పెళ్లైన తర్వాత నటిస్తావా?' అని ఓ అభిమాని అడిగితే నటిస్తానని సమాధానం చెప్పింది. 

పెళ్లి కూతురి ఆర్మీ అంతా కలిసి పెళ్లి చూడటానికి గోవాకి వచ్చేస్తుంది.. అని మరో అభిమాని అన్నాడు. ఇక మరోకరైతే మీరు ఇద్దరు కలిసింది. ప్రేమించుకుంది గౌతమ్‌ మీనన్‌ 'ఏమాయ చేశావే' చిత్రంలో కదా...! మరి మీ ఇద్దరికి పుట్టిన బిడ్డకు గౌతమ్‌ మీనన్‌ అని పేరు పెడతారా? దానికి సమంత నవ్వుతున్న ఎమోజీలు పెట్టింది. ఈ సందర్భంగా అభిమానులు సమంతకు విషెష్‌ తెలిపారు. మొత్తానికి అల్లరి ఫ్యాన్స్‌తో కలిసి వివాహంలో బిజీగా ఉన్నా కూడా సమంత తన ఫ్యాన్స్‌ని మర్చిపోకుండా వారితో మాటలతో గడిపేసింది. 

Samantha Gived Answers in Twitter To Fans!:

Samantha marriage on today 06th October 2017 with Naga Chaitanya at Goa. Samantha fans asked same&nbsp;<span>cute questions.</span>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs