Advertisement
Google Ads BL

పిక్ టాక్: చైతూ పెళ్లికొడుకాయనే..!


నాగ చైతన్య - సమంతల వివాహం నేడు శుక్రవారం గోవాలో ఒక హోటల్ లో జరగబోతున్న సంగతి తెలిసిందే. ఈ రోజు రాత్రి 11 గంటల 30  నిమిషాలకు చైతు - సామ్ లు పెళ్లిపీటలెక్కబోతున్నారు. ఇప్పటికే గోవా చేరుకున్న ఇరు కుటుంబాల బంధు మిత్రులు ఈ పెళ్లి వేడుకలను షురూ చేశారు. అక్కినేని, దగ్గుబాటి కుటుంబాలు నాగ చైతన్య తరుపునుండి.... సమంత తల్లితండ్రులు ఇంకొద్దిమంది బందుమిత్రులు సమంత వైపు నుండి ఈ పెళ్లి వేడుకలకు విచ్చేశారు. ఈ రోజు రాత్రి జరగబోయే పెళ్ళికి అప్పుడే నాగ చైతన్య పెళ్లి కొడుకు గెటప్ లోకి మారిపోయాడు. నాగ చైతన్యని పెళ్లి కొడుకుని చేసి తన తండ్రి నాగార్జున, మామయ్య వెంకటేష్ లు కలిసి దిగిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది.

Advertisement
CJ Advs

పెళ్లి కొడుకుగా నాగ చైతన్య వెలిగిపోతున్నాడు. ఇక చైతుతో నాగార్జున, వెంకటేష్ లు కూడా నవ్వుతూ దిగిన ఆ ఆఫొటో వైరల్ అయ్యింది. మరి పెళ్లికొడుకు గెటప్ లో నాగ చైతన్య అదిరిపోయే నవ్వుతో బయటికి వచ్చేశాడు. మరి వధువు సమంత ఎక్కడుంది? ఇంకా పెళ్లి కూతురుగా సామ్ ముస్తాబు అవ్వలేదా.. అంటూ అక్కినేని అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఇకపోతే ఈ రోజు మధ్యాన్నం మూడు గంటలకు సమంత మెహిందీ వేడుకలు స్టార్ట్ అవుతాయి. ఇక హిందూ సంప్రదాయంలో నాగ చైతన్య ఈ రోజు శుక్రవారం సామ్ మేడలో తాళి కడితే... రేపు శనివారం క్రిష్టియన్ సాంప్రదాయంలో మనువాడబోతున్నాడు. ఇక ఈ పెళ్లి వేడుకలను బంధుమిత్రులంతా ఎంతో.. ఎంజాయ్  చేస్తున్నట్టుగా వార్తలొస్తున్నాయి.

Naga Chaitanya Bridegroom Look:

Naga Chaitanya Photo with Nagarjuna and Venkatesh
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs