Advertisement
Google Ads BL

మహేష్ కి మిల్క్‌ బిస్కెట్లు వేస్తోంది!


హీరోల అందులోనూ స్టార్స్‌ చలువ ఉంటే ఏకంగా ఒకే ఒక్క చిన్న ఛాన్స్‌తో హీరోయిన్‌గా ఎదగవచ్చని నిరూపించింది తేజస్వి మదివాడ. 'సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు'లో చిన్న క్యారెక్టర్‌ వేసిన ఆమె నేడు చిన్నచిత్రాలలో సోలో హీరోయిన్‌గా చాన్స్‌లు దక్కించుకుంటున్న సంగతి తెలిసిందే. ఇక 'శ్రీమంతుడు' చిత్రంలో సమంతకు క్లోజ్‌ ఫ్రెండ్స్‌లో ఒకరిగా నటించిన శ్రావ్యరెడ్డి కూడా మహేష్‌ 'భరత్‌ అనే నేను' చిత్రంలో మరో వేషం ఇస్తే తాను చిన్న చిత్రాలకు సోలో హీరోయిన్‌గా మారవచ్చని భావిస్తోందో ఏమో గానీ మహేష్‌ని మునగచెట్టు ఎక్కిస్తోంది. 

Advertisement
CJ Advs

మహేష్‌ ముందుగానే చెప్పినట్లు ఆయన అభిమానులు చాలా క్లియర్‌గా ఉంటారు. సినిమా బాగుంటేనే చూస్తారు. లేకపోతే మౌనం వహిస్తారు. 'బ్రహ్మోత్సవం, స్పైడర్‌' చిత్రాల విషయంలో ఇదే జరిగింది. అంచనాలు లేకుండా 'స్పైడర్‌' సినిమా చూసిన వారు ఓకే అంటుంటే మహేష్‌ ఫ్యాన్స్‌ మాత్రం తమ స్థాయికి లేదని తేల్చేస్తున్నారు. ఇక ఈ చిత్రం విడుదలైన బుధవారం నుంచి శ్రావ్యారెడ్డి వరుస పెట్టి ట్వీట్స్‌ చేస్తోంది. మహేష్‌ను, ఆయన సినిమాను ద్వేషిస్తున్న వారందరికీ నిజంగా జబ్బు ఉన్నట్లు అనిపిస్తోంది. ఇంతలా ఆయన చిత్రాన్ని ఎందుకు ద్వేషిస్తున్నారు? తన ద్వేషాన్ని, ఆగ్రహాన్ని ప్రదర్శించడానికి మహేష్‌ ఎవ్వరినీ అపాయింట్‌ చేసుకోలేదు. ఇండస్ట్రీలో మహేష్‌కి ఉన్న క్లీన్‌ ఇమేజ్‌ మరెవ్వరికీ లేదు. తన సినిమా కోసం ఎంతో డెడికేషన్‌తో మహేష్‌ పనిచేస్తారు. దర్శకులను కూడా అదే స్థాయిలో నమ్ముతారు. తన ఫెయిల్యూర్స్‌ విషయంలో ఎవ్వరినీ నిందించడం గానీ పక్కవారి మీదకు తోసేయడం మాత్రం మహేష్‌ ఎప్పుడు చేయడు. ఎలాంటి కారణం లేకుండా మహేష్‌పై ద్వేషం పెంచుకుంటున్నారు. అభిమానం ఉంటే వారిపై ప్రేమను చూపండి.. ద్వేషాన్ని కాదు.. అంటూ ట్వీట్స్‌ చేస్తోంది. 

నిజమే.. ఆమె చెప్పే గుణాలన్నీ మహేష్‌లో ఉన్నాయి. కానీ ఓ మనిషి మంచితనం సినిమాను హిట్‌ చేయలేదు కదా...! ఇక మహేష్‌ పట్ల ఎవ్వరూ వ్యతిరేకంగా లేరు. ఎన్టీఆర్‌, బన్నీ వంటి వారు తమ చిత్రాల చేతగాని తనాన్ని సోషల్‌మీడియాపై, నెటిజన్లపై, విశ్లేషకులపై చూపితే మహేష్‌ మాత్రం సినిమాలోని లోపాలను గమనించి హుందాగా ఉండటం ఆయనపై అభిమానాన్ని చాలా మందిలో పెంచిందే గానీ తగ్గించలేదు. అయినా ఎంత మంచి మనిషైనా వ్యక్తిత్వాన్ని బట్టి విజయాలు, కక్ష్య పెంచుకునే రివ్యూలు రావని మహేష్‌కి తెలిసినంతగా ఎన్టీఆర్‌, బన్నీ వంటి వారికి తెలియడం లేదనే భావించాలి. 

Anchor and Actress Sharvya Reddy Suggestion to Mahesh Haters:

Actress Sharvya Reddy Sensational Comments on Mahesh Haters
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs