Advertisement
Google Ads BL

గది కోసం నాగ్ సెంటిమెంట్ వాడుతున్నాడు!


అక్కినేని నాగార్జున ఒకపక్క 'రాజుగారి గది 2' ప్రమోషన్స్ తోనూ... మరోపక్క నాగ చైతన్య - సమంత ల పెళ్లి పనులతోను బిజీ బిజీగా గడుపుతున్నాడు. చైతు - సామ్ ల పెళ్లి విషయాలు ఆ జంటకే వదిలేసినా... పెళ్లి అన్నాక వంద రకాల పనులు ఉంటాయి గనక.. ఆ పనుల్లో నాగార్జున తలమునకలైనప్పటికీ... కూడా రాజుగారి గది2 ప్రమోషన్స్ విషయంలో నాగ్ ఏ మాత్రం తగ్గడంలేదు. ఓంకార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నాగార్జున మెంటలిస్ట్ గా నటిస్తుండగా. నాగ్  కోడలు సమంత ఆత్మగా కనబడనుంది. ఇక ఓంకార్ తమ్ముడు అశ్విన్, సీరత్ కపూర్ లు హీరో హీరోయిన్స్ గా నటించారు.

Advertisement
CJ Advs

ఇక ఈ నెల 13 న విడుదల కాబోతున్న ఈ చిత్ర ప్రమోషన్స్ లో నాగ్ ఫ్యామిలీ సెంటిమెంట్ వాడుతున్నాడు. నా కోడలు సమంతని రాజుగారి గది2 సినిమాలో అలా చూడలేకపోతున్నాను అని అంటూనే... అలాంటిది చైతు సమంతని అలా చూడగలడా ఛాన్సే లేదంటున్నాడు. అంతేకాకుండా సమంత ఈ సినిమాలో చాలా భయానకంగా ఉంటుంది అని హింట్ ఇచ్చేస్తున్నాడు నాగ్. మరి రాజుగారి గది2 ప్రమోషన్స్ ని భుజానికెత్తుకున్న నాగార్జున ఆ సినిమాని బాగానే ప్రమోట్ చేస్తూ జనాల్లోకి తీసుకెళుతున్నాడు.

అసలు నాగార్జున ఆ సినిమాకి అంతలా ప్రమోషన్ ఇవ్వక్కర్లేకపోయినా కూడా నాగార్జున మాత్రం పూర్తి కమిట్మెంట్ తోనే ఈ చిత్ర ప్రమోషన్స్ లో పాల్గొంటున్నాడు. అయినా నాగ్ మొదటినుండి ఇదే పద్దతి ఫాలో అవుతున్నాడు.

Nag Using Family Sentiment for Raju Gari Gadhi 2 Movie:

Nagarjuna Promotes Raju Gari Gadhi 2 with Sentiment
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs