మరికొన్ని గంటల్లో నాగచైతన్య-సమంతలు వివాహం చేసుకొని ఒక్కటవ్వబోతున్నారు. ఇప్పటికే పెళ్లి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయట. 6 వ తేదీన హిందు సంప్రదాయం ప్రకారం, 7వ తేదీన క్రిస్టియన్ మత సంప్రదాయం ప్రకారం వివాహం జరుగనుంది. ఇప్పటికే అక్కినేని, దగ్గుబాటి, సమంత కుటుంబాలకు అత్యంత సన్నిహితులైన 150 మంది గోవా వచ్చేశారని తెలుస్తోంది. ఇక తమ అభిమాన ఫ్యామిలీ కుటుంబంలోని హీరో పెళ్లిని స్వయంగా చూడలేకపోయామన్న బాధ కాస్తైనా ఆ అభిమానుల్లో ఉంటుంది. దీంతో ఈ వివాహాన్ని రికార్డు చేసి దాదాపుగా లైవ్‌లో అయినా ప్రసారం చేస్తారనుకున్న వారికి నిరాశే మిగిలింది.
ఈ పెళ్లికి వచ్చిన అతిథులకు సమంత ఆ కండీషన్ అండ్ రిక్వెస్ట్‌ని పెట్టిందట. ఈ పెళ్లికి హాజరయ్యే ఎవ్వరు చిన్న వీడియో క్లిప్పును కూడా తీయరాదని, పెళ్లి తర్వాత సమయం చూసుకుని తామే పెళ్లి వీడియోను అందిస్తామని చెప్పిందట. దానికి అతిధులు కూడా ఓకే అనేశారు. ఇక సినిమా మొదలుపెట్టిన తర్వాత టైటిల్ ఎనౌన్స్ చేయడం, తర్వాత ఫస్ట్‌లుక్, టీజర్, తర్వాత ట్రైలర్.. ఇలా ప్రేక్షకుల అటెన్షన్‌ని తమపై ఉంచేందుకు యూనిట్ ఎన్ని కసరత్తులు చేయాలో అన్ని చేస్తుంది. సమంత వీడియోలు తీయకూడదనే నిబంధన కూడా అలాగే ఉందంటున్నారు.
వారి పెళ్లి కనులారా చూడలేకపోయిన అభిమానుల కోసం ఆ పెళ్లికి హాజరైన అతిథులు ఎవరైనా తీసిన ఫొటోలను సోషల్‌మీడియాలో చూసుకోవడమో.. అదీ లేకపోతే సమంత వీడియాలను రిలీజ్ చేసే దాకా ఎదురుచూడటమో అక్కినేని ఫ్యామిలీ అభిమానులకు వెయిటింగ్ తప్పదు. ఇంతకీ సమంత ఈ కండీషన్ ఎందుకు పెట్టిందో మాత్రం ఫుల్ క్లారిటీ ఎవ్వరికీ లేదు. ఇక ఈ పెళ్లిని సింపుల్‌గా చేస్తున్నారు. కానీ ఖర్చు మాత్రం 10కోట్లు అని సమాచారం. హాజరయ్యే అందరికీ రానుపోను విమాన చార్జీలను ఈ జంట స్వయంగా భరించనుంది. దాంతోనే బడ్జెట్ 10కోట్లు అంటున్నారు. మరి సింపుల్‌గా చేసుకుంటున్న పెళ్లికే 10కోట్లు అంటే ఇక వారు హైదరాబాద్‌లో అందరికీ ఇచ్చే రిసెప్షన్ ఖర్చు ఎంతవుతుందో ఏమో మరి....!